ETV Bharat / international

ఆ కిరణాలతో గదుల్లోని కరోనా వైరస్​ అంతం - అతినీల లోహిత కిరణాలు

ఇండోర్​ వాతావరణంలో, సామాజిక దూరం పాటించడానికి వీల్లేని ప్రదేశాల్లో కరోనా ముప్పు నుంచి తప్పించుకోవడానికి అతినీలలోహిత కిరణాలు ఉపయోగపడుతాయని అంటున్నారు పరిశోధకులు. ఇప్పటివరకు ఉన్న క్రిమినాశనక విధానాల కంటే ఈ విధానం ఎంతో మెరుగైన ఫలితాలను ఇస్తోందని చెబుతున్నారు.

ultraviolet rays can kill corona virus in indoor areas
ఆ కిరణాలతో గదుల్లోని కరోనా వైరస్​ అంతం
author img

By

Published : Dec 3, 2020, 6:55 AM IST

కరోనా ముప్పు అధికంగా ఉండే భవన అంతర్గత ప్రదేశాలను అతినీలలోహిత కిరణాల ద్వారా సురక్షితంగా ఉంచుకోవచ్చని తాజా పరిశోధనలో రూఢి అయింది. ముఖ్యంగా ఆసుపత్రుల్లో మహమ్మారి వ్యాపించకుండా ఈ విధానం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. బ్రిటన్​లోని క్రాన్​ఫీల్డ్​ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ పరిశోధన వివరాలను 'సైంటిఫిక్​ రిపోర్ట్స్​' పత్రిక అందించింది.

కరోనా వైరస్​ తలెత్తిన తర్వాత గృహాలు, కార్యాలయాలు, ఆసుపత్రులు వంటి భవనాల్లో తలుపులు, కిటికీలను బాగా తెరిచి ఉంచాలని నిపుణులు సూచించారు. అయితే.. గదుల్లోనూ, అక్కడి వస్తువులపైనా తిష్ఠవేసిన వైరస్​ను ఎలా అంతమొందించాలన్నది పెద్ద సమస్యగా మారింది. దీనిపై పరిశోధన సాగించిన శాస్త్రవేత్తలు.. సురక్షితమైన అతినీల లోహిత కిరణాల(యూవీసీ) ద్వారా దీన్ని నాశనం చేయవచ్చని నిరూపించారు.

"ఇండోర్​ వాతావరణంలో, సామాజిక దూరం పాటించడానికి వీల్లేని ప్రదేశాల్లో యూవీసీని ప్రయోగించడం ద్వారా కరోనా వైరస్​ నుంచి రక్షణ పొందవచ్చు. ఇప్పటివరకూ ఉన్న క్రిమినాశనక విధానాల కంటే ఇదెంతో మెరుగైన ఫలితాలను ఇస్తోంది. పైగా దీనికయ్యే ఖర్చు కూడా తక్కువే. బల్బుల రూపంలో సురక్షితమైన అతినీలలోహిత కిరణాలను గదుల్లో ప్రసరింపజేస్తే సరిపోతుంది" అని పరిశోధన రూపకర్త లియాంగ్​ యాంగ్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:వచ్చే వారం రష్యాలో సామూహిక వ్యాక్సినేషన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.