ETV Bharat / international

చిన్నచిన్న రిపబ్లిక్‌లుగా విడగొట్టి.. తోలు బొమ్మ ప్రభుత్వాలు ఏర్పాటు - రష్యా ఉక్రెయిన్ యుద్ధం

Ukrainians Protests: ఉక్రెయిన్​పై దాడి తర్వాత.. తన అధీనంలోకి వచ్చిన ప్రాంతాలపై పట్టు నిలుపుకోవడానికి రష్యా ఏం చేయబోతోంది? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. సామ, దాన, భేద, దండోపాయాలతో స్థానిక పాలనా యంత్రాంగాన్ని దారిలోకి తెచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్‌ దృశ్యాన్ని కళ్లకు కడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌ను చిన్నచిన్న రిపబ్లిక్‌లుగా విడగొట్టి, తోలు బొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటు చేయవచ్చని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పోరు ముగింపు లేదా ఇతర దేశాలకు వ్యాప్తి చెందే అవకాశాన్ని ఈ వ్యూహం ప్రభావితం చేయనుందని పేర్కొంటున్నారు.

putin
పుతిన్
author img

By

Published : Mar 21, 2022, 9:57 AM IST

Ukrainians Protests: యుద్ధం ఆరంభమైన మొదట్లోనే దక్షిణ ఉక్రెయిన్​లోని ఖేర్సన్ ప్రొంతాన్ని రష్యా ఆక్రమించింది. అక్కడి ఖేర్సన్‌, స్కాదోవ్​స్క్, నోవా కఖోవ్కా నగరాల్లో పెద్దగా సైనిక ప్రతిఘటనను ఎదుర్కోలేదు. అనంతరం జపోరిజియా ప్రాంతం గుండా పుతిన్‌ సేన ముందుకు సాగింది. అక్కడ మెలిటోపొల్‌, బెర్డియాన్స్క్, జపోరిజియా అణువిద్యుత్‌ కర్మాగారాలు ఉన్నాయి. ఆ ప్రాంతం నుంచి మేరియుపొల్‌ సమీపానికి రష్యా బలగాలు చేరుకున్నాయి. ఆ నగరం వద్ద ఉక్రెయిన్‌ సైన్యం నుంచి వారికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీంతో మేరియుపొల్‌ను ముట్టడించి, భీకరంగా బాంబులతో విరుచుకుపడుతోంది.

జనం ససేమిరా..

ఖేర్సన్ ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకున్న వెంటనే స్థానిక అధికారులతో రష్యా సైన్యం సమావేశమైంది. తమకు సహకరించాలంది. ఈ ప్రాంతాన్ని స్వతంత్ర రిపబ్లిక్‌ (ఖేర్సన్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌)గా ప్రకటిస్తామని, ఈ దిశగా ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని స్పష్టంచేసింది. దీన్ని ఖేర్సన్‌, మెలిటోపోల్, బెర్డియాన్​స్క్ నగరాలు తిరస్కరించాయి. రష్యా సైన్యానికి సహాయ నిరాకరణ చేశాయి. సామాజిక మాధ్యమాల ద్వారా వేల మంది నిరసన తెలిపారు. 'మాది ఉక్రెయిన్‌ నగరం' అని నినదించారు. రష్యా తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణ అక్రమమంటూ ఖేర్సన్‌ ప్రాంతీయ మండలి ఈ నెల 22న ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

ధిక్కారంపై ఉక్కుపాదం..

ఖేర్సన్‌వాసుల ధిక్కారంపై రష్యా సైన్యం మండిపడింది. ప్రాంతీయ మండలికి ఎన్నికైన నభ్యులు, ఉక్రెయిన్‌ పౌర అధికారులను లక్ష్యంగా చేసుకొంది. మెలిటోపొల్, డీప్రోరుండ్నే నగరాల మేయర్లను కిడ్నాప్‌ చేసింది. మెలిటోపొల్‌లో రష్యా సైన్యం గాలినా డానిల్‌చెంకోను కొత్త మేయర్‌గా ఎంపిక చేసింది. ఈయన విపక్ష సభ్యుడు. ఈ ప్రతిపక్షంలో రష్యా అనుకూల మాజీ అధ్యక్షుడు విక్టర్‌ యాంకోవిచ్ పార్టీ సభ్యులే ఎక్కువ మంది ఉన్నారు. పుతిన్‌ సేన సాయంతో డానిల్‌చెంకో, ఇతర నేతలు కొత్త డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు.స్థానిక ప్రభుత్వాలు తమకు సహకరించాలని, లేదంటే అందుకు సిద్ధంగా ఉన్న ఇతరులను ఆ స్థానాల్లో నియమిస్తామని స్పష్టంచేస్తున్నారు.

పాత వ్యూహాలే..

2014లో డాన్‌బాస్‌ ప్రాంతంలోనూ రష్యా ఇలాంటి వ్యూహాలే పన్నింది. బెదిరింపులు, బలప్రయోగంతో స్థానిక అధికారులకు ఉద్వాసన పలికి, వారి స్థానంలో తమకు అనుకూలురైన వర్గాలకు పదవులు కట్టబెట్టింది. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, మితవాద మేధావులు, పాత్రికేయులు, ఇతర ప్రభావశీల వర్గాలను పుతిన్‌ సేన లక్ష్యంగా చేసుకుంది. బెదిరింపులకు దిగడం, చిత్రహింసల పాల్జేయడం ద్వారా వారిని భయభ్రాంతులకు గురిచేసింది. ఉక్రెయిన్‌లోనూ ఇలాగే జరగొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రతినిధులకు ఉద్వాసన పలికి, సొంత అనుచరులను పెట్టుకోవడం ఇందుకు నిదర్శనం. డాన్‌బాస్‌లో అనుసరించిన వ్యూహం ప్రకారం చూస్తే ఇక్కడ కూడా మరిన్ని అప్రకటిత రాష్ట్రాలను ఏర్పర్చడం రష్యా వ్యూహంలా కనిపిస్తోంది. దీనివల్ల తమ మద్దతుదారుల ద్వారా ఆయా ప్రాంతాలపై మరింత పట్టు బిగించడానికి పుతిన్‌కు వీలు కలుగుతుంది. అదే సమయంలో అక్కడ పౌర జనాభా పట్ల నిర్వర్తించాల్సిన విధుల నుంచి తప్పించుకోవచ్చు. అక్కడ జరిగిన యుద్ధనేరాలకూ తనది బాధ్యత కాదని చెప్పుకోవచ్చు. మొత్తంమీద రష్యా అదుపులోకి వచ్చే ఉక్రెయిన్‌ భూభాగాలు.. గుర్తింపులేని స్వయంపాలిత రాష్ట్రాలుగా మిగిలిపోయే అవకాశం ఉంది. అక్కడ అనిశ్చిత పరిస్థితులు తలెత్తవచ్చు. అవి ఉక్రెయిన్‌ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లోకీ కల్లోలాన్ని వ్యాప్తి చేయవచ్చు.

మాల్దోవా, జార్జియాపై గురి..

ఈ యుద్దాన్ని రష్యా ఎక్కడికి, ఎలా తీసుకెళుతుందన్నది కూడా తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌ తర్వాత మాల్దోవాకు పుతిన్‌సేన నుంచి ముప్పు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణ మాల్దోవాలోని గాగ్వాజియా స్వయంప్రతిపత్తి ప్రాంతంలో రష్యాకు కొంత ప్రాబల్యం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఉక్రెయిన్‌ తరహా పరిస్థితులను పుతిన్‌ సృష్టించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

జార్జియాలోని అద్జారా ప్రాంతంలోని బాటుమిలో రష్యాకు ఒక సైనిక స్థావరం ఉండేది. ఈ ప్రాంతంపైనా పుతిన్‌ దృష్టిసారించొచ్చు. అయితే ఈ దిశగా రష్యా ప్రయత్నాలు ఫలించడం అనుమానమే. ఈ రెండు ప్రాంతాలతో టర్కీకి గట్టి సంబంధాలు ఉండటమే ఇందుకు కారణం. అయితే ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌ ప్రాంతాలపై పూర్తిగా పట్టు సాధించకపోయినా.. అక్కడ అస్థిరతను రాజేసినా చాలని రష్యా భావించొచ్చు. బాల్టిక్‌ ప్రాంత దేశాలైన లాత్వియా, ఎస్తోనియాకూ పుతిన్‌ నుంచి ముప్పు పొంచి ఉంది. అక్కడ రష్యన్లు, రష్యన్‌ భాష మాట్లాడే మైనార్టీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే అక్కడ రష్యా నేరుగా జోక్యం చేసుకోకపోవచ్చు. లోపాయికారీగా కొన్ని చర్యలు చేపట్టవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: 'పుతిన్​తో చర్చలకు సిద్ధం.. విఫలమైతే మూడో ప్రపంచయుద్ధమే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.