ETV Bharat / international

తీవ్ర ఆంక్షలు విధిస్తున్నా తగ్గని రష్యా.. ఉక్రెయిన్​పై భీకర దాడులు

Ukraine crisis: రష్యా సైన్యం చేస్తున్న భీకర దాడులతో ఉక్రెయిన్​ అల్లాడిపోతోంది. ఎటు చూసిన ధ్వంసమైన భవనాలు, శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. మైకొలైవ్‌ నగరంలో శనివారం ఓ కేన్సర్‌ ఆసుపత్రిని, అనేక నివాస భవనాలను రష్యా సేనలు ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఉక్రెయిన్​లో జీవాయుధాల ల్యాబ్​లు ఉన్నాయని యూఎన్​ఎస్​సీకి తెలిపింది రష్యా. దానిని అమెరికా ఖండించింది.

Ukraine crisis
ఉక్రెయిన్‌ యుద్ధం
author img

By

Published : Mar 13, 2022, 7:16 AM IST

Ukraine crisis: ఎలాగైనా ఉక్రెయిన్‌పై పట్టు సాధించాలనుకుంటున్న రష్యా ఎంతమాత్రం వెనక్కి తగ్గకుండా బాంబులు, రాకెట్లను వివిధ నగరాలపైకి సంధిస్తోంది. గడ్డ కట్టించే చలిలోనూ అడుగు ముందుకు వేసే పంతంతో పావులు కదుపుతోంది. దాడుల్లో పాక్షికంగా దెబ్బతిన్న భవనాల లోపలకు అతి శీతల గాలులు రాకుండా చూసుకోవడం ప్రజలకు కష్టసాధ్యంగా మారింది. మేరియుపొల్‌ నగరంలో 34 మంది పిల్లలు సహా దాదాపు 86 మంది టర్కీ పౌరులు తలదాచుకున్న ఒక మసీదుపై శనివారం రష్యా సేనలు బాంబులు కురిపించాయి. ప్రాణనష్టం ఏ మేరకు వాటిల్లిందనే వివరాలు వెల్లడికాలేదు. రాజధాని కీవ్‌పై, ఆ నగర శివార్లలోని పలు ప్రాంతాలపై దాడులు చోటుచేసుకున్నాయి. మైకొలైవ్‌ నగరంలో ఒక కేన్సర్‌ ఆసుపత్రిని, అనేక నివాస భవనాలను రష్యా సేనలు ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ వర్గాలు తెలిపాయి.

Ukraine crisis
.

పట్టు కోసం మళ్లీ ప్రయత్నం

కీవ్‌పై దండయాత్రకు కిలోమీటర్ల పొడవైన వాహన శ్రేణితో బయల్దేరి కొంత దూరంలో ఆగిన రష్యా సేనలు క్రమంగా ముందుకు వస్తున్నాయి. సాయుధ ప్రతిఘటనను అణచివేయడానికి సిరియా, చెచెన్యా వంటిచోట్ల నింగి నుంచి, నేల నుంచి అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు ఉక్రెయిన్‌ విషయంలోనూ రష్యా పాటిస్తోంది. కీవ్‌ సమీపంలోని ఆయుధ డిపోపై దాడుల తర్వాత దాని ప్రభావానికి వందల సంఖ్యలో చిన్నస్థాయి పేలుళ్లు సంభవించాయి. మృతదేహాలను పూడ్చిపెట్టడానికైనా విరామం ఇవ్వని రీతిలో దాడులు కొనసాగుతున్నాయి. ఖర్కివ్‌ను కూడా సేనలు చుట్టుముడుతున్నాయి. మరోవైపు రష్యా శనివారం మరో మేజర్‌ జనరల్‌ (ఆండ్రీ కొలెష్నికోవ్‌)ను యుద్ధంలో కోల్పోయింది.

Ukraine crisis
.

అటు ఆంక్షలు.. ఇటు దాడులు..

రష్యాను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు కట్టుదిట్టమైన ఆంక్షలు విధిస్తున్నా, ఆ దేశ సేనలు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. బాంబు దాడులతో ఉక్రెయిన్‌లో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. మెలిటొపోల్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా సైన్యం.. ఆ నగర మేయర్‌ను అపహరించుకుపోయినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. శత్రు సైనికులకు సహకరించట్లేదనే ఉక్రోషంతో ఇలా చేసినట్లు తెలిపారు. ‘రష్యా ఉగ్రవాదం కొత్త దశలోకి మారింది. చట్టబద్ధ ప్రతినిధులపై భౌతిక దాడులకు పాల్పడుతోంది. ఇది ఐసిస్‌ ఉగ్రవాదుల చర్యకంటే తక్కువేం కాదు’ అని మండిపడ్డారు. ఇప్పటివరకు 1,300 మంది ఉక్రెయిన్‌ సైనికులు ఈ యుద్ధంలో చనిపోయారని తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ ఫోన్లో మాట్లాడి, యుద్ధాన్ని తక్షణం విరమించాలని కోరారు. జెలెన్‌స్కీతో కూడా షోల్జ్‌ విడిగా ఫోన్లో మాట్లాడారు. పుతిన్‌తో జెరూసలెంలో సమావేశమయ్యేందుకు జెలెన్‌స్కీ ప్రతిపాదించారు. మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ఇజ్రాయెల్‌ ప్రధాని బెన్నెట్‌ను కోరారు.

Ukraine crisis
.

ఉక్రెయిన్‌లో జీవాయుధ ల్యాబ్‌లు: రష్యా

జీవాయుధాల అంశంపై ఐరాస భద్రతా మండలి వేదికగా అగ్రరాజ్యాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి. ఈ తరహా ఆయుధాల తయారీ ల్యాబ్‌లను ఉక్రెయిన్‌లో అమెరికా నిర్వహిస్తోందని రష్యా ఆరోపించింది. దాన్ని అమెరికా ఖండించింది. ఉక్రెయిన్‌పై జీవ, రసాయన అస్త్రాలను ప్రయోగించే కుట్రలో భాగంగానే ఇలాంటి వాదనలను చేస్తున్నారని విమర్శించింది. జీవాయుధ ల్యాబ్‌ల అంశంపై చర్చించాలన్న రష్యా విజ్ఞప్తి మేరకు భద్రతా మండలి శుక్రవారం సమావేశమైంది. ఉక్రెయిన్‌లో కనీసం 30 ల్యాబ్‌లు ఉన్నాయని, అక్కడ ప్రమాదకరమైన వ్యాధికారక సూక్ష్మజీవులతో ప్రయోగాలు జరుగుతున్నట్లు తమ వద్ద పత్రాలు ఉన్నాయని ఐరాసలో రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా ఆరోపించారు. వీటిని అమెరికా స్వీయ నిధులతో నిర్వహిస్తోందని తెలిపారు. అయితే ఉక్రెయిన్‌పై రసాయన లేదా జీవాయుధాలను ప్రయోగించి, ఆ నెపాన్ని ఇతరులపైకి నెట్టే కుట్రలో భాగంగానే రష్యా ఇలాంటి వాదన చేస్తోందని ఐరాసలో అమెరికా రాయబారి లిండా థామస్‌ గ్రీన్‌ఫీల్డ్‌ పేర్కొన్నారు. ఆ దేశం ఇలా చేస్తుందని గత నెలలో తమ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ చెప్పినట్లు గుర్తుచేశారు. ఉక్రెయిన్‌లో తమ సాయంతో ఏర్పాటు చేసిన వసతుల్లో కొవిడ్‌-19 వంటి వ్యాధులను గుర్తిస్తున్నారని పేర్కొన్నారు.

Ukraine crisis
ఐరాస భద్రతా మండలిలో రష్యా ప్రతినిధి

పుతిన్‌ ప్రభుత్వ ఆరోపణలు అర్థరహితమని ఐరాసలో బ్రిటన్‌ రాయబారి బర్బరా వుడ్‌వర్డ్‌ పేర్కొన్నారు. 'రష్యా పాతాళానికి జారిపోతోంది. దానితోపాటు భద్రతా మండలిని కూడా అదే స్థాయికి దిగజార్చకూడదు' అని చెప్పారు. మరోవైపు ఉక్రెయిన్‌లో జీవాయుధ కార్యక్రమాలు నడుస్తున్నట్లు తమ దృష్టికేమీ రాలేదని ఐరాస నిరాయుధీకరణ విభాగం అధిపతి ఇజుమి నకామిత్సు తెలిపారు. మారుపేరుతో తమపై మరోసారి దాడి చేయడానికి రష్యా ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్‌ రాయబారి సెర్గీ కిస్లిత్స్యా ఆరోపించారు. కాగా జీవ, రసాయన ఆయుధాల ఒప్పందానికి సంబంధించిన అంశాలను ఆయా దేశాలు సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని ఈ సమావేశంలో భారత్‌ సూచించింది. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నట్లు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్‌.తిరుమూర్తి తెలిపారు.

వారికి ఆయుధాలిచ్చేవారూ మాకు లక్ష్యమవుతారు: రష్యా

ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేసేందుకు ముందుకు వస్తున్న దేశాలకు రష్యా శనివారం ఓ హెచ్చరిక జారీ చేసింది. పశ్చిమ దేశాలు అక్కడకు ఆయుధాలు పంపిస్తే ఆ వాహన శ్రేణులు తమకు లక్ష్యాలుగా మారుతాయని రష్యా విదేశాంగ శాఖ సహాయ మంత్రి సెర్గే ర్యాబ్‌కోవ్‌ శనివారం ప్రకటించారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయడం ప్రమాదకరమైన చర్య అని అమెరికా సహా అనేక దేశాలను ఇప్పటికే హెచ్చరించామని చెప్పారు.తమ హెచ్చరికల్ని అమెరికా తీవ్రంగా పరిగణించలేదన్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.