ETV Bharat / international

భారత జెండా.. టర్కీ, పాకిస్థాన్​ విద్యార్థులకు అండ - India Flag

Ukraine Crisis: రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్​ నుంచి బయటపడాలనుకున్నవారికి భారత జాతీయ జెండా శ్రీరామ రక్ష అయింది. ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతపౌరులతో పాటు పాకిస్థాన్​, టర్కీ విద్యార్థులకు కూడా మన త్రివర్ణ పతాకం అండగా నిలిచింది. భారత ప్రభుత్వ ఉపాయంతో మన జెండాను పట్టుకుని వారు ఉక్రెయిన్​ సరిహద్దులు దాటుతున్నారు.

Ukraine crisis
Ukraine crisis
author img

By

Published : Mar 3, 2022, 5:26 AM IST

Ukraine Crisis: రష్యా దాడులతో కల్లోలంగా మారిన ఉక్రెయిన్‌ నుంచి బయటపడేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులు కోవడం లేదు. ముఖ్యంగా భారత పౌరులు ఉక్రెయిన్‌ సరిహద్దులు దాటి ఇతర దేశాల సరిహద్దులకు చేరుకోవాలని భారత ప్రభుత్వం పేర్కొంది. ఇందుకోసం భారత జాతీయ జెండాలను పట్టుకోవాలని పౌరులకు సూచించింది. ఈ ఉపాయాన్ని అందిపుచ్చుకుని కొందరు పాకిస్థాన్‌, టర్కీకి చెందిన విద్యార్థులు కూడా ఉక్రెయిన్‌ సరిహద్దులను సురక్షితంగా దాటగలిగారు.

ఉక్రెయిన్‌లోని భారతీయులను తరలించేందుకు 'ఆపరేషన్‌ గంగ' పేరుతో కేంద్రం ప్రత్యేక విమానాలు నడుపుతోంది. ఎయిరిండియా, స్పైస్‌జెట్‌, ఇండిగో సంస్థలు ఈ విమానాలు నడుపుతున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యేక విమానం అందుకునేందుకు ఉక్రెయిన్‌ పొరుగుదేశమైన రొమేనియాలోని బుచారెస్ట్‌కు కొందరు భారత విద్యార్థులు చేరుకున్నారు. భారత జెండాలను పట్టుకోవాలన్న భారత ప్రభుత్వ సూచనను వారు పాటించారు.

అయితే, తాము జాతీయ జెండాను ఎలా రూపొందించిందీ ఉక్రెయిన్‌లోని ఒడెసా నుంచి బుచారెస్ట్‌కు చేరుకున్న ఓ విద్యార్థి వివరించారు. ప్రభుత్వం సూచించిన వెంటనే మార్కెట్‌కు వెళ్లి జాతీయ జెండా రంగులు ఉన్న స్ప్రేలు కొనుగోలు చేసి, వాటితో జాతీయ జెండాను రూపొందించామని ఆ విద్యార్థి వివరించాడు. మన జెండాను చూపించి ఉక్రెయిన్‌ సరిహద్దును దాటడం తమకు సులువైందని పేర్కొన్నాడు. అయితే, తమను చూసిన కొందరు పాకిస్థాన్‌, టర్కీ విద్యార్థులు సైతం భారత జాతీయ జెండాను చేతబూని సరిహద్దులను దాటారని వివరించాడు. ఉక్రెయిన్‌లోని మాల్దోవాలో సరిహద్దుల్లో భారత రాయబార కార్యాలయం తమకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసిందని, అక్కడి ప్రజలు కూడా తమకు సహకరించారని తెలిపాడు.

ఇదీ చూడండి: రెండోసారి పుతిన్​తో మోదీ ఫోన్ సంభాషణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.