ETV Bharat / international

చైనా లక్ష్యంగా బ్రిటన్ అణ్వాయుధాల అభివృద్ధి! - బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

చైనా లక్ష్యంగా బ్రిటన్ తన సైనిక, విదేశాంగ విధానాలకు పదనుపెట్టింది. డ్రాగన్​ను కట్టడి చేసే లక్ష్యంతో.. మరిన్ని అణ్వాయుధాలు అభివృద్ధి చేసుకోవాలని నిర్ణయించింది. అయితే, కొన్ని అంశాల్లో చైనాతో కలిసి పనిచేస్తామని పేర్కొంది.

UK to build more nuclear weapons to counter challenges posed by China
చైనా లక్ష్యంగా బ్రిటన్ సైనిక, విదేశాంగ విధానాలు!
author img

By

Published : Mar 17, 2021, 1:08 PM IST

అంతర్జాతీయంగా చైనా దూకుడుకు పగ్గాలేసే దిశగా బ్రిటన్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంది. డ్రాగన్ సవాళ్లను ఎదుర్కొనేందుకు మరిన్ని అణ్వాయుధాలను అభివృద్ధి చేయడం సహా అంతరిక్ష, సైబర్​స్పేస్ రంగాల్లో తన స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని లక్ష్యించుకుంది. ఈ మేరకు బ్రిటన్ సైనిక, విదేశాంగ విధానాలపై సమీక్ష నిర్వహించిన బోరిస్ జాన్సన్ సర్కార్.. తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది.

చైనాను యూకే ఆర్థిక వ్యవస్థకు ఉన్న అతిపెద్ద ప్రభుత్వపరమైన ముప్పుగా నివేదిక అభివర్ణించింది. రోజురోజుకు పెరుగుతున్న చైనా శక్తిసామర్థ్యాలు, దూకుడు విధానాలు.. భౌగోళిక రాజకీయ విషయాల్లో అత్యంత ప్రాధాన్యంతో కూడుకున్న అంశాలని చెప్పుకొచ్చింది. మరోవైపు, రష్యాను బ్రిటన్ భద్రతకు పొంచి ఉన్న పెను సవాల్​గా పేర్కొంది.

చైనాపై బోరిస్ మండిపాటు

ఈ నివేదిక విడుదలైన తర్వాత పార్లమెంట్ వేదికగా చైనాపై విరుచుకుపడ్డారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. షింజియాంగ్​లోని ఉయ్గుర్ ప్రజలను సామూహికంగా నిర్బంధించడాన్ని ఖండించారు. హాంకాంగ్​లో ప్రజాస్వామ్య అనుకూల వ్యక్తుల పట్ల వ్యవహరించే తీరును తప్పుబట్టారు.

"మనలాంటి బహిరంగ సమాజాలకు(ప్రజాస్వామ్య దేశాలను ఉద్దేశించి) చైనా అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, మన విలువలు, ప్రయోజనాల కోసం చైనాతో కలిసి పనిచేస్తాం. బలమైన ఆర్థిక సంబంధాలు నెలకొల్పడం సహా పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం."

-బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధాని

వచ్చే నాలుగేళ్లలో రక్షణ వ్యయాలను 24 బిలియన్ యూరోల మేర పెంచాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సింగపూర్, ఒమన్, కెన్యా, జిబ్రాల్టర్​లో ఉన్న సైనిక శిబిరాలను పునర్​వ్యవస్థీకరించనున్నట్లు తెలిపింది. తద్వారా బ్రిటన్ ప్రాబల్యాన్ని విస్తరించడమే కాకుండా.. కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని పేర్కొంది.

ఇదీ చదవండి: 'మహిళలను విస్మరించే ప్రజాస్వామ్యం లోపభూయిష్ఠం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.