బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజెబెత్-2, ప్రిన్స్ విలియం, హ్యారీ సహా కుటుంబసభ్యుల నడుమ, అధికారిక లాంఛనాలతో ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు ముగిశాయి. ప్రిన్స్ ఫిలిప్ స్వయంగా డిజైన్ చేసిన ల్యాండ్‌రోవర్ మీద విండ్సర్‌క్యాస్టిల్ నుంచి శవపేటికను తరలించారు . సీనియర్ మిలిటరీ కమాండర్లు, సైనిక లాంఛనాల మధ్య ప్రిన్స్ ఫిలిప్ పార్థివ దేహం సెయింట్ జార్జ్‌ఛాపెల్ చేరుకోగా అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో రాజకుటుంబీకులు, వారి సన్నిహితులు కేవలం 30 మంది మాత్రమే అంత్యక్రియలకు హాజరయ్యారు.
ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియల సందర్భంగా బ్రిటన్ పౌరులంతా ఒక్క నిమిషం పాటు మౌనం పాటించారు. ఏప్రిల్ 9 వ తేదీన 99 ఏళ్ల ఫిలిప్ కన్నుమూశారు.
ఇదీ చదవండి : 'ఇండో పసిఫిక్'లో చైనాకు చెక్ పెట్టేలా అమెరికా, జపాన్ చర్చలు