బ్రిటన్‌లో నాలుగు నెలల విధ్వంసం తర్వాత కొన్ని రోజులు ఊరటనిచ్చిన కరోనా.. మళ్లీ విజృంభిస్తోంది. పెరుగుతున్న కేసులను అదుపు చేయడానికి లాక్డౌన్ పెట్టాలని అక్కడి ప్రధాని బోరిస్ జాన్సన్ ఆలోచిస్తున్నట్లు సమాాచారం. మరోవైపు లాక్డౌన్ విధించకపోతే కేసులు వేగంగా పెరిగిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రభుత్వం నెలరోజుల పాటు ఆంక్షలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. అనంతరం డిసెంబర్లో క్రిస్మస్ పండుగకు ముందు లాక్డౌన్ ఎత్తివేయాలని బోరిస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. అయితే దీనిపై తుది నిర్ణయం సోమవారం వెలువడే అవకాశం ఉంది.
- కెనడాలో మరో 1,015 కేసులు వెలుగు చూశాయి. కొత్తగా తొమ్మిది మరణాలు నమోదయ్యాయి.
- దక్షిణ సూడాన్‌లో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
- నార్వేలో కొత్తగా 152 మందికి వైరస్ సోకింది.
- న్యూజిలాండ్‌లో 7 మంది మహమ్మారి బారిన పడ్డారు.
- మెక్సికోలో అత్యధికంగా 516 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు
దేశం | కేసులు | మరణాలు |
అమెరికా | 93,24,833 | 2,35,264 |
బ్రెజిల్ | 55,19,528 | 1,59,562 |
రష్యా | 16,18,116 | 27,990 |
ఫ్రాన్స్ | 13,31,984 | 36,565 |
స్పెయిన్ | 12,64,517 | 35,878 |