భారత్‌కు సంబంధించిన రెండు వేరువేరు విషయాలపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడుతూ.. కొంత తికమకకు గురైయ్యారు. ప్రతిపక్ష పార్టీ నేత తన్మన్జీత్ సింగ్ థేసి అడిగిన ఓ ప్రశ్నకు వేరే సమాధానం ఇచ్చారు. దీనిపై థేసి ట్విట్టర్లో బోరిస్‌పై ఛలోక్తులు విసిరారు.
ఇదీ జరిగింది...
భారత్‌లో రైతుల సమస్యలపై ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడి శాంతియుత పరిష్కారానికి కృషి చేయాలని లేబర్ పార్టీ ఎంపీ తన్మన్జీత్ సింగ్ థేసి.. ప్రధాని బోరిస్ జాన్సన్‌ను కోరారు. ఇందుకు సమాధానంగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య వివాదాన్ని ఉభయ దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
దీనిపై థేసి ట్వీట్ చేశారు. 'మా ప్రధాని మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. మీకు తెలిస్తే చెప్పి కొంచెం సహాయపడండి,' అని ఛలోక్తులు విసిరారు.