బ్రెగ్జిట్ ఒప్పందంపై బ్రిటన్ ప్రధాని 'థెరెసా మే'కు పార్లమెంట్లో మరోసారి పరాభవం తప్పలేదు. మే ప్రతిపాదించిన బ్రెగ్జిట్ ఒప్పందం పార్లమెంట్లో రెండోసారి తిరస్కరణకు గురైంది.
391 మంది సభ్యులున్న బ్రిటన్ దిగువ సభ (హౌజ్ ఆఫ్ కామన్స్)లో 242 మంది మే ప్రతిపాదనను వ్యతిరేకించారు. థెరెసా పార్టీకి చెందిన 75 మంది కన్సర్వేటివ్ ఎంపీలు సైతం ఆమె ప్రతిపాదనను తిరస్కరించారు.
బ్రెగ్జిట్ ప్రతిపాదనలు వీగిపోవటంపై థెరెసా విచారం వ్యక్తం చేశారు. సమాఖ్య నుంచి విడిపోయిన అనంతరం జరిగే పరిణామాలపై తనకు అవగాహన ఉందని, కానీ చట్టసభ సభ్యుల ప్రవర్తన మాత్రం విచారంగా ఉందని వ్యాఖ్యానించారు.
థెరెసా ప్రతిపాదనలు ఇక పూర్తిగా ముగిసినట్లేనని లేబర్ పార్టీ ప్రకటించింది. ఐరోపా సమాఖ్య నుంచి వైదొలిగే ప్రక్రియపై బుధవారం చర్చించనున్నారు. యురోపియన్ యూనియన్ నుంచి మరో రెండు వారాల్లో బ్రిటన్ వైదొలగనుంది.
ఇదీ చూడండి:అంకుర సంస్థలకు ఫేస్బుక్ ఊతం..