బ్రిటన్‌లో 'డెన్నిస్' తుపాను బీభత్సం సృష్టిస్తోంది. పలు పట్టణాలు, నగరాల్లో భీకర గాలులతో వర్షాలు కురిశాయి. ఫలితంగా.. వేల్స్, స్కాట్లాండ్లలో అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ప్రాణాంతక వరదల బారినుంచి తమను తాము రక్షించుకోవాలని ప్రజల్ని కోరారు.
సుమారుగా 250పైగా వరద ముప్పులు పొంచి ఉన్నాయని బ్రిటన్ వాతావరణ సేవా కార్యాలయం హెచ్చరించింది.
భారీ వర్షం.. భీకర గాలులు
ఒక్కరోజు వ్యవధిలోనే ఆగ్నేయ వేల్స్లో సుమారుగా 105మిల్లీ మీటర్ల(4.1 అంగుళాలు) భారీ వర్షం కురిసింది. హరికేన్ ప్రాంతంలో గంటకు 91 మైళ్ల(146 కిలోమీటర్లు) వేగంతో భీకర గాలులు వీచాయి. ఫలితంగా వందలాది విమాన, రైలు సర్వీసులు రద్దయ్యాయి. వేలమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలకు కూడా మధ్యంతర సెలవులు ప్రకటించారు.
రక్షణ చర్యలను ముమ్మరం చేసిన బ్రిటిష్ ప్రభుత్వం.. ఆర్మీ సిబ్బంది, రిజర్విస్ట్‌లను రంగంలోకి దింపింది.
ఇదీ చదవండి: ఆసియా దాటిన కరోనా... ఫ్రాన్స్‌లో తొలి మరణం