ETV Bharat / international

గార్డెన్​ జిమ్... లాక్​డౌన్​ వేళ నయా ట్రెండ్​ - britain corona cases

జిమ్​లకు వేలకు వేలు ఫీజులు చెల్లించనవసరం లేకుండా.. లాక్​డౌన్​ నిబంధనలకు తూట్లు పొడవకుండానే ఆరోగ్యాన్ని పొందుతున్నారు లండన్​వాసులు. ముంగిట్లోనే వ్యాయామాలు చేస్తూ మరో నాలుగు వీధులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

UK GARDEN FITNESS  A street in London is staying fit during the coronavirus lockdown by working out together in their front gardens.
గార్డెన్​ జిమ్... లాక్​డౌన్​ వేళ నయా ట్రెండ్​
author img

By

Published : Apr 5, 2020, 9:26 AM IST

గార్డెన్​ జిమ్... లాక్​డౌన్​ వేళ నయా ట్రెండ్​

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారత్​ తరహాలో బ్రిటన్​ ప్రభుత్వమూ లాక్​డౌన్​​ విధించింది. అయితే, ఇంట్లో కూర్చుని కొవిడ్​-19ను తలచుకుంటూ బెంబేలెత్తిపోకుండా.. ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా.. ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నారు లండన్​లోని ఓ​ కాలనీవాసులు.

గార్డెన్​ ఫిట్​నెస్​...

లాక్​డౌన్​ కారణంగా జిమ్​లకు వెళ్లడమే కాదు, కాస్త దూరం నడవడమూ కుదరట్లేలేదు. ఏదో రోజులో ఓ సారి ఇంటి సరుకులు తెచ్చకునేందుకు వీలున్నా.. ఇంటికి ఒక్కరే వెళ్లాలి. ఇలా రోజంతా ఇంట్లోనే ఉండడం వల్ల శరీరం, మనసు డీలా పడిపోతున్నట్లు గ్రహించింది వ్యాయామ గురువు హన్నా వెర్డీయర్. ఇరుగుపొరుగువారికి ఫోన్​చేసి వారికి వ్యాయామ తరగతులు నిర్వహిస్తానని తెలిపింది.

కొద్దిరోజులుగా ఇంట్లోనే మగ్గుతున్న కాలనీవాసులకు వెర్డీయర్​ మాటలు ఊరటనిచ్చాయి. కానీ, లాక్​డౌన్​ వేళ వ్యాయామ తరగతులకు అనుమతి ఎలా ఇస్తారని అనుకున్నారు. అందుకూ ఓ ఉపాయం ఆలోచించింది వెర్డీయర్​. సామాజిక దూరం పాటించేలా, ఎవరి ఇంటి ముందువారే నిలబడి 'గార్డెన్​ ఫిట్​నెస్​' పేరిట ఎక్సర్​సైజ్​ చేయాలని సూచించింది.

రోజూ ఉదయం11 గంటలకు బయటికొస్తుంది వెర్డీయర్​​. సామాజిక దూరం పాటిస్తూ.. ఫిట్​నెస్​ క్లాసులు మొదలెడుతుంది. ఈ తరగతుల్లో మహిళలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

"లాక్​డౌన్​కు రెండు వారాల ముందు నేను వ్యక్తిగత వ్యాయామ శిక్షకురాలిగా అర్హత సాధించాను. నేను నా వ్యాపారాన్ని ప్రారంభించాను. నా కస్టమర్లతో మంచి సెషన్లు కొనసాగిస్తున్న సమయంలోనే.. లాక్​డౌన్​ కారణంగా అన్నీ ఆగిపోయాయి. అందుకే, పొరుగువారికి నా విద్య ఉపయోగపడాలని అనుకున్నాను. సురక్షితమైన దూరం పాటిస్తూ... వారితో వ్యాయామం చేయించొచ్చు కదా అని ఆలోచించాను. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల ఎంతో ఉత్సాహం లభిస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవచ్చు."

-హన్నా వెర్డీయర్​, వ్యాయామ గురువు

ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మనస్సును ఆహ్లాదంగా ఉంచే ఉపాయం చేసినందుకు వెర్డీయర్​ను తెగ పొగిడేస్తున్నారు ఇరుగుపొరుగువారు.

ఇదీ చదవండి:కరోనాకన్నా ముందు వచ్చిన మహమ్మారులు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.