ETV Bharat / international

మాస్క్​ తప్పనిసరి కాదు.. వర్క్​ ఫ్రమ్​ హోమ్ ఇక లేదు.. బ్రిటన్​లో కొత్త రూల్స్! - uk covid rules

UK Covid Restrictions: కరోనా కట్టడికి ప్రపంచ దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తుంటే.. బ్రిటన్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కొవిడ్​-19 ఆంక్షలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు ప్రధాని బోరిస్​ జాన్సన్​. మాస్కు కూడా తప్పనిసరి కాదని వెల్లడించారు.

UK PM Johnson rolling back COVID-19 measures

author img

By

Published : Jan 20, 2022, 10:47 AM IST

UK Covid Restrictions: బ్రిటన్​ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఓవైపు ప్రపంచ దేశాలను ఒమిక్రాన్​ వణికిస్తుంటే.. యూకేలో కొవిడ్​ ఆంక్షలను మొత్తం ఎత్తివేసినట్లు ప్రకటించారు ప్రధాని బోరిస్​ జాన్సన్​. ఇంగ్లాండ్​లో మాస్క్​ తప్పనిసరి నిబంధన సహా ఇతర కొవిడ్​ ఆంక్షలన్నింటికీ ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించారు.

కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​.. గరిష్ఠస్థాయికి చేరి, తగ్గుముఖం పట్టినట్లు శాస్త్రవేత్తలు చెప్పారని బోరిస్​ తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం సదుపాయం కూడా ఉండదని పేర్కొన్నారు.

''ఒమిక్రాన్​ పీక్​ దశను అధిగమించిందని దేశ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటినుంచి.. వర్క్​ ఫ్రం హోం చేయాలని ప్రభుత్వం ప్రజలను కోరదు.​ ప్రపంచ దేశాల్లో వ్యాక్సిన్​ను మొట్టమొదట అందించింది యూకేనే.''

- బోరిస్​ జాన్సన్​, బ్రిటన్​ ప్రధానమంత్రి

గత వేసవిలో చాలా మంది వ్యతిరేకించినా దేశంలో కఠిన ఆంక్షలు విధించినట్లు గుర్తుచేసుకున్నారు బోరిస్​. ఇప్పుడు ఇతర దేశాల్లో లాక్​డౌన్​ ఉన్నా.. తాము అన్ని కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని అన్నారు. అందుకే జీ-7 దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్​ అవతరించిందని పేర్కొన్నారు.

బూస్టర్​ డోసుల పంపిణీ వేగవంతం చేయడం కారణంగానే.. ఒమిక్రాన్​ నుంచి బయటపడిన తొలి దేశం తమదేనని అన్నారు యూకే ప్రధాని.

'' ప్లాన్​ బీ నిబంధనల పట్ల ప్రజల ప్రతిస్పందనను బట్టి.. ఇప్పుడు ప్లాన్​ ఏకు తిరిగి వచ్చాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, 1918లో సంభవించిన మహమ్మారి తర్వాత ఇదే మాకు అతి పెద్ద సవాలు. ఇలాంటి సమయంలో ఏ ప్రభుత్వమైనా కొన్ని తప్పులు చేస్తుంటుంది.''

- బోరిస్​ జాన్సన్​

ఫేస్​ మాస్కులు ధరించడం, కొవిడ్​ పాసులు తప్పనిసరి, వర్క్​ ఫ్రం హోం వంటివి ప్లాన్​- బీ నిబంధనల్లో భాగంగా ఉన్నాయి. ఇప్పుడు వీటికి ముగింపు పలికింది బ్రిటన్​ ప్రభుత్వం.

UK Covid Cases: జనవరి 18న దేశంలో 94 వేలకుపైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 438 మంది మరణించారు.

యూకేలో మొత్తం 5 కోట్ల 20 లక్షల మందికిపైగా టీకా తొలి డోసును పొందగా.. 4 కోట్ల 79 లక్షలకుపైగా టీకా రెండు డోసులను తీసుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 3 కోట్ల 65 లక్షల మంది బూస్టర్​ డోసును పొందారు.

Boris Johnson Lockdown Party: కొవిడ్‌ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం దేశమంతటా నిషేధాజ్ఞలు అమలు చేసిన బ్రిటన్‌లో గతేడాది.. ప్రధాని కార్యాలయ సిబ్బందే వాటిని ఉల్లంఘించి విందులు, వినోదాలు జరుపుకున్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాన స్వయంగా క్షమాపణలు చెప్పినా.. వివాదం సద్దుమణగలేదు. నిబంధనలు ఉల్లంఘించిన బోరిస్‌.. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోరిస్‌ మరోసారి ఆ ఘటనపై వివరణ ఇచ్చారు. ఆ పార్టీ జరుపుకోవడం కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధమని అధికారులెవరూ తనకు చెప్పలేదన్నారు. తొలిసారి లాక్‌డౌన్‌ విధించిన సమయంలో తాము పనిచేస్తున్న పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దేశమంతటా ఆంక్షలు ఎత్తివేయడం చర్చనీయాంశమైంది.

ఇవీ చూడండి: ఏడు రోజుల్లో 1.8కోట్ల కేసులు- ఆ దేశాల్లో తగ్గిన ఒమిక్రాన్ వ్యాప్తి!

భారత్​లో కరోనా కల్లోలం- ఒక్కరోజే 3 లక్షలకుపైగా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.