ETV Bharat / international

ఫైజర్​ టీకా వినియోగానికి యూకే ఓకే

కొవిడ్​ వ్యాక్సిన్​ ఫైజర్​ వినియోగానికి అనుమతులు ఇచ్చింది బ్రిటన్. ఈ టీకా వినియోగానికి ఆమోదం తెలిపిన తొలిదేశంగా నిలిచింది. ఈ క్రమంలో వచ్చేవారం దేశవ్యాప్తంగా టీకా అందుబాటులోకి రానుంది. 2021 చివరి నాటికి 4 కోట్ల డోసులు పొందనున్నట్లు అధికారులు తెలిపారు.

Pfizer vaccine
ఫైజర్​ టీకాకు యూకే అనుమతి
author img

By

Published : Dec 2, 2020, 1:03 PM IST

Updated : Dec 2, 2020, 5:03 PM IST

అమెరికన్​ దిగ్గజ ఫార్మా సంస్థ ఫైజర్​, జర్మనీకి చెందిన బయోఎన్​టెక్​ సంస్థలు కలిసి అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్​ వినియోగానికి అనుమతించింది బ్రిటన్​. ఫైజర్​ టీకాను ఆమోదించిన తొలి దేశంగా నిలించింది. కరోనా వైరస్​ను అంతమొందించేందుకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్​ పంపిణీకి మార్గం సుగమం చేసింది.

కొవిడ్​-19పై తమ టీకా 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రకటించింది ఫైజర్​ సంస్థ. ఈ క్రమంలో ఫైజర్​ టీకా నాణ్యత, భద్రత, సామర్థ్యంలో అన్ని ప్రమాణాలను పాటిస్తే అనుమతులు ఇవ్వాలని బ్రిటన్​ ప్రభుత్వం.. తమ ఔషధ, ఆరోగ్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థ (ఎంహెచ్​ఆర్​ఏ)కు సూచించింది. టీకాపై పరిశీలన చేసిన ఎంహెచ్​ఆర్​ఏ.. వినియోగించేందుకు సురక్షితమని తేల్చింది.

2021 చివరి నాటికి 4 కోట్ల డోసులు..

ఫైజర్​ టీకాకు అనుమతులు వచ్చిన క్రమంలో దేశంలోని మూడోవంతు ప్రజలకు సరిపోయేంతగా.. సుమారు 4 కోట్ల డోసులను 2021 చివరి నాటికి పొందనుంది బ్రిటన్​. ఇందులో ప్రధానంగా వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలోపే అందుతాయని అధికారులు భావిస్తున్నారు.

"అనుమతులు వస్తే.. జాతీయ ఆరోగ్య సేవలు(ఎన్​హెచ్​ఎస్​) విభాగం పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంది. పెద్ద ఎత్తున వ్యాక్సిన్​ పంపిణీల్లో ఎన్​హెచ్​ఎస్​కు మంచి అనుభవం ఉంది. ప్రాధాన్య క్రమంలో వ్యాక్సిన్​ వేగంగా చేరవేసేందుకు అవసరమైన సౌకర్యాలు ఉన్నాయి." అని గత నెలలోనే పేర్కొన్నారు యూకే ఆరోగ్య శాఖ మంత్రి మాట్​ హాన్​కోక్​.

మొదట వీరికే..

ఫైజర్​ టీకాను ప్రాధాన్యక్రమంలో పంపిణీ చేయనున్నారు. తొలుత వృద్ధాశ్రమంలో ఉండే వారికి అందించనున్నారు. వృద్ధులను చూసుకునే సంరక్షకులకు కూడా తొలి దశలోనే వ్యాక్సిన్​ ఇవ్వనున్నారు.

వ్యాక్సిన్​ పంపిణీ ఇలా..

  1. కేర్​ హోమ్స్​లో ఉండే వృద్ధులకు, వారి సంరక్షకులకు తొలి ప్రాధాన్యం.
  2. 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు కలిగినవారు. ఆరోగ్య, సామాజిక కార్యకర్తలు.
  3. 75 ఏళ్లు పైబడినవారు.
  4. 70 ఏళ్లు పైబడిన వారు. తీవ్ర అనారోగ్యం బారినపడ్డవారు.
  5. 65 ఏళ్లు పైబడినవారు.
  6. తీవ్ర రోగాల బారినపడి చనిపోయే అవకాశం ఉన్న 16-64 ఏళ్ల మధ్య వయస్కులకు
  7. 60 ఏళ్లు పైబడిన వారు
  8. 55 ఏళ్లు పైబడిన వారు
  9. 50 ఏళ్లు పైబడిన వారు

ఇదీ చూడండి: డిసెంబర్​లోనే అందుబాటులోకి ఫైజర్​ వ్యాక్సిన్​!

Last Updated : Dec 2, 2020, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.