అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ ఉబర్‌కు బ్రిటన్ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. డ్రైవర్లను స్వయం ఉపాధి పొందుతున్న వారిగా గుర్తించాలన్న ఉబర్ అభ్యర్థనను యూకే సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. డ్రైవర్లను కార్మికులుగానే గుర్తించి, వారికి కార్మిక చట్టంలోని ప్రయోజనాలను అందించాలని ఆదేశించింది.
తమను కార్మికులుగా గుర్తించి యూకే ప్రాథమిక కార్మికుల ప్రయోజనాలను కల్పించాలంటూ.. ఉబర్ డ్రైవర్ల బృందం కోర్టును ఆశ్రయించింది. దీనిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఉబర్ సంస్థలో పని చేస్తున్న డ్రైవర్లను కార్మికులుగా గుర్తించి.. కనీస వేతనం, సెలవులు, అనారోగ్య సెలవులు వంటివి అమలు చేయాలని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పు పట్ల డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ తీర్పుపై స్పందించిన ఉబర్.. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని తెలిపింది.
ఇదీ చూడండి: మయన్మార్ సైనిక తిరుగుబాటుపై ఆగని నిరసనలు