ETV Bharat / international

మరియా రెస్సా, దిమిత్రికి నోబెల్​ శాంతి పురస్కారం - nobel peace prize 2021 news

భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడేందుకు చేసిన కృషికి గాను మరియా రెస్సా, దిమిత్రి మురటోవ్​కు ఈ ఏడాది నోబెల్​ శాంతి బహుమతి(nobel peace prize 2021) దక్కింది. ఈ మేరకు రాయల్‌ స్వీడిష్‌ అకాడమి ప్రకటించింది.

nobel-peace-prize-2021
మరియా రెస్సా, దిమిత్రికి నోబెల్​ శాంతి పురస్కారం
author img

By

Published : Oct 8, 2021, 2:36 PM IST

Updated : Oct 8, 2021, 3:25 PM IST

ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి పురస్కారం(nobel peace prize 2021) ఇద్దరిని వరించింది. ప్రజాస్వామ్యానికి మూలమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షణ కోసం చేసిన కృషికి గానూ ప్రముఖ పాత్రికేయులు మరియా రెసా(ఫిలప్పీన్స్‌), దిమిత్రి మురటోవ్‌(రష్యా)లకు ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు నోబెల్‌ కమిటీ ప్రకటించింది(nobel peace prize). ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం వీరు(Nobel Peace Prize winners) ధైర్యంగా పోరాడుతున్నారని కమిటీ ఈ సందర్భంగా ప్రశంసించింది.

అధికార దుర్వినియోగం, అసత్యాలు, యుద్ధ కాంక్ష నుంచి రక్షించడానికి స్వేచ్ఛా, స్వతంత్ర, వాస్తవ-ఆధారిత జర్నలిజం ఉపయోగపడుతుందని తెలిపింది స్వీడిష్​ కమిటీ. భావ ప్రకటనా స్వేచ్ఛ, సమాచార స్వేచ్ఛ.. ప్రజలకు సమాచారం ఇవ్వటానికి ఉపయోగపడుతుందన్న వాదనతో ఏకీభవిస్తున్నట్లు పేర్కొంది. వీరిద్దరూ తమ తమ దేశాల్లో దినపత్రికలను నడుపుతున్నారు. ప్రజాస్వామ్యం, యుద్ధం, సంక్షోభాల నుంచి కాపాడేందుకు.. ఈ హక్కులు చాలా కీలకమని నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ తెలిపింది. ప్రాథమిక హక్కులను రక్షించటం, వాటి ప్రాముఖ్యతను చాటేందుకే మరియా రెస్సా, డిమిత్రి మురాటోవ్‌ను ఈ అవార్డ్‌కు ఎంపిక చేసినట్లు పేర్కొంది.

రాప్లర్​ పేరుతో..

ఫిలిప్పీన్స్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు మరియా రెస్సా (Nobel Peace Prize winners).. తమ దేశంలో నానాటికీ పెరుగుతున్న అధికార దుర్వినియోగం, హింసను తన కలంతో ప్రపంచానికి తెలియజేశారు. ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం కోసం 2012లో ఆమె 'రాప్లర్‌' పేరుతో ఓ డిజిటల్‌ మీడియా కంపెనీని స్థాపించారు. ఓ జర్నలిస్టుగా, రాప్లర్‌ సీఈఓగా రెసా.. ఎన్నో సంచలనాత్మక కథనాలను ధైర్యంగా ప్రచురించారు. అధికార పరంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటూనే.. భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడుతూ వస్తున్నారు.

nobel-peace-prize-2021
మరియా రెస్సా

దశాబ్దాలుగా పోరాటం..

రష్యాకు చెందిన జర్నలిస్టు దిమిత్రి మురటోవ్‌ మీడియా స్వేచ్ఛ కోసం దశాబ్దాలుగా పోరాటం సాగిస్తున్నారు. రష్యాకు చెందిన ప్రముఖ వార్తా పత్రిక నొవాజా గజెటా వ్యవస్థాపకుల్లో ఈయన కూడా ఒకరు. 24 ఏళ్ల పాటు ఆ పత్రిక ఎడిటర్‌గా చేశారు. ఈ పత్రికను ప్రారంభించిప్పటి నుంచి తమ దేశంలో పేరుకుపోయిన అవినీతి, విధానపరమైన హింస, చట్ట వ్యతిరేక అరెస్టులు, ఎన్నికల్లో మోసాలు వంటి ఎన్నో సంచలనాత్మక కథనాలు ప్రచురించారు. దీంతో ఎన్నోసార్లు ఈ పత్రికకు బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకూ ఈ సంస్థకు చెందిన ఆరుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అయినప్పటికీ మురాటోవ్‌ వెనుకడుగు వేయకుండా తమ సిద్ధాంతాలను పాటిస్తూ వస్తున్నారు.

nobel-peace-prize-2021
దిమిత్రి మురటోవ్​

ఇదీ చూడండి: శరణార్థుల వ్యథకు అక్షరరూపం- రజాక్​కు నోబెల్​

బెంజమిన్, డేవిడ్​కు రసాయన శాస్త్రంలో నోబెల్​

డేవిడ్​-ఆర్డెమ్​కు వైద్య శాస్త్రంలో నోబెల్​ బహుమతి

Last Updated : Oct 8, 2021, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.