కరోనా వైరస్ తోకముడిచినట్లే ముడిచి, మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఐరోపా ఖండంలోని పలు దేశాలు మరోసారి వైరస్(Europe Covid Cases) కోరల్లో చిక్కుకున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)(Who Coronavirus Cases) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఏడాది ప్రారంభం నాటికి మరో 5 లక్షల మరణాలు(Europe Covid Cases) సంభవించొచ్చని అంచనా వేసింది.
"ఐరోపా ఖండంలోని దేశాల్లో ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇదే తీరుగా వైరస్ ఉద్ధృతి కొనసాగితే వచ్చే ఫిబ్రవరి నాటికి మరో ఐదు లక్షల కొవిడ్ మరణాలు సంభవిస్తాయని ఒక అంచనా."
-హన్స్ క్లూగే, డబ్ల్యూహెచ్ఓ ఐరోపా విభాగం డైరెక్టర్.
ఐరోపాలో వరుసగా ఐదోవారం కొవిడ్ కేసుల సంఖ్య(Europe Covid Cases) పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా.. ఈ ఖండంలోనే కొవిడ్ ఉద్ధృతి పెరుగుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ బుధవారం వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో కేసులు తగ్గడం లేక నిలకడగా కొనసాగడం కనిపిస్తోందని పేర్కొంది. ఇన్ఫెక్షన్ రేటు కూడా అక్కడే ఎక్కువగా ఉన్నట్లు చెప్పింది. ప్రతి లక్ష జనాభాకు 192 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా బ్రిటన్, రష్యా, టర్కీ, రొమేనియాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది.
ఇవీ చూడండి:
రష్యా, జర్మనీపై కొవిడ్ పంజా- మరణాలు, కేసుల్లో కొత్త రికార్డులు