ETV Bharat / international

కరోనా బాధితుల్లో నెలల తరబడి రోగ లక్షణాలు - corona negative

కొవిడ్​ సోకిన వారిలో లక్షణాలు మాత్రం నెలల తరబడి ఉంటున్నట్లు ఫ్రాన్స్​లో జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా 40-60 ఏళ్ల మధ్య వయసున్న వారిలో దీర్ఘకాలం పాటు లక్షణాలు ఉంటున్నాయని అంటున్నారు పరిశోధకులు. కరోనా తగ్గినా.. ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ వహించాలని చెబుతున్నారు.

Symptoms in corona patients
కరోనా బాధితుల్లో నెలల తరబడి రోగ లక్షణాలు
author img

By

Published : Oct 9, 2020, 3:15 PM IST

కరోనా సోకి స్వల్ప స్థాయిలో అనారోగ్యానికి గురైనప్పటికీ లక్షణాలు మాత్రం నెలల తరబడి ఉంటున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. మరికొంత మందిలో రోజులు గడుస్తున్న కొద్దీ అనారోగ్యం మరింత తీవ్రమవుతోందని తెలిసింది. ఈ మేరకు ఫ్రాన్స్‌లో మార్చి-జూన్‌ మధ్యలో జరిపిన ఓ అధ్యయనాన్ని క్లినికల్‌ మైక్రోబయాలజీ అండ్‌ ఇన్ఫెక్షన్‌ జర్నల్‌లో ప్రచురించారు.

స్వల్ప నుంచి మోస్తరు స్థాయి లక్షణాలున్న 150 మంది కొవిడ్‌ బాధితులపై ఈ అధ్యయనం జరిపారు. వీరిలో 66.66 శాతం మందిలో కరోనా నిర్ధరణ అయిన 60 రోజుల తర్వాత కూడా లక్షణాలు తగ్గలేదు. రుచి, వాసన కోల్పోవడం, శ్వాస సమస్య, అలసట, జ్వరం, జలుబు సహా మరికొన్ని కొవిడ్‌ లక్షణాల్లో ఏదో ఒకటి వీరిలో కనిపిస్తున్నట్లు గుర్తించారు.

నెగెటివ్​ వచ్చినా అనారోగ్య సమస్యలు..

ఇక 33.33 శాతం మందిలో తొలినాళ్లతో పోలిస్తే ఆరోగ్యం బాగా క్షీణించింది. ముఖ్యంగా 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారిలో లక్షణాలు దీర్ఘకాలం కొనసాగాయి. కరోనా నెగెటివ్‌గా నిర్ధరణ అయినప్పటికీ.. చాలా మంది శ్వాసకోశ, గుండె సంబంధిత ఇబ్బందులు సహా మరికొన్ని అనారోగ్య సమస్యలకు గురవుతున్నట్లు పలు పరిశీలనల్లో ఇప్పటికే వెల్లడైంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని తేలింది. మహమ్మారి పూర్తిగా అంతమైన తర్వాత కూడా ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం గుర్తు చేస్తోందని ఈ పరిశోధనలో పాల్గొన్న ఓ శాస్త్రవేత్త తెలిపారు. దీనిపై మరింత లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.