ఐరోపా దేశమైన స్వీడన్లో బుధవారం దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళకు ప్రధాని పగ్గాలు అప్పగించడం.. కొద్ది గంటల్లోనే ఆమె రాజీనామా(Sweden PM resign) చేయడం వంటి పరిణామాలు చకచకా చోటుచేసుకున్నాయి.
మగ్దలీనా అండర్సన్‌కు(54) దేశ పాలన పగ్గాలను అప్పగిస్తూ పార్లమెంటు ఆమోదం తెలిపింది. దేశఆర్థిక మంత్రి, సోషల్ డెమోక్రాటిక్ పార్టీ నేతగా ఇటీవల ఎన్నికైన అండర్సన్ అరుదైన ఘనతను దక్కించుకున్నారంటూ అంతర్జాతీయంగా ప్రశంసలు కూడా అందుకున్నారు. కొద్ది గంటల్లోనే పార్లమెంటులో ఓ బడ్జెట్ ఓడిపోవడం, రెండు పార్టీలతో కూడిన మైనారిటీ ప్రభుత్వం నుంచి ఓ సంకీర్ణ భాగస్వామి వైదొలగడంతో ఆమె(Sweden PM news) రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మగ్దలీనా.. "ఈ బాధ్యత గౌరవప్రదమే అయినా.. ఉనికి ప్రశ్నార్థకమయ్యే సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించాలని నేను కోరుకోవడం లేదు" అని ఆమె వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: ''ఇండో-పసిఫిక్ ఇనీషియేటివ్'ను గుర్తిస్తున్నాము'