ETV Bharat / international

'మేథో హక్కుల రద్దు'కు పెరుగుతున్న మద్దతు.. కానీ!

అమెరికా తర్వాత.. కరోనా టీకాపై మేథో సంపత్తి హక్కులను రద్దుకు మద్దతిచ్చింది ఫ్రాన్స్​. ఈ విషయాన్ని ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్​ మేక్రాన్​ వెల్లడించారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఐరోపా సమాఖ్య వైఖరి ఎలా ఉంటుందన్నది సర్వత్తా చర్చనీయాంశమైంది. శుక్రవారం జరగనున్న సమావేశంలో దీనిపై చర్చించనున్నట్టు ఈయూ వెల్లడించింది. అయితే పేద దేశాలకు కరోనా టీకా అందాలంటే ఇది సరైన మార్గం కాదని ఫార్మా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. దీని వల్ల దీర్ఘకాలంలో నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నాయి.

support-grows-for-ip-waiver-on-virus-vaccines-snags-remain
'మేథో హక్కుల రద్దు'కు పెరుగుతున్న మద్దతు.. కానీ!
author img

By

Published : May 6, 2021, 9:19 PM IST

కరోనా టీకాపై మేథో సంపత్తి హక్కులను రద్దు చేస్తున్న దేశాల జాబితా పెరుగుతోంది. ఈ 'ట్రిప్స్​ నిబంధన'లను రద్దు చేస్తున్నట్టు అమెరికా ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా ఫ్రాన్స్​ కూడా ఇందుకు చేతులు కలిపింది.

"మేథో సంపత్తి హక్కులను రద్దు చేయడాన్ని నేను పూర్తిగా మద్దతిస్తున్నా" అని ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్​ మేక్రాన్​ పేర్కొన్నారు. అయితే సమస్య పరిష్కారానికి ఇది సరిపోదని అభిప్రాయపడ్డారు. మేథో సంపత్తి హక్కులను ఎత్తివేసినా.. ఆఫ్రికా వంటి దేశాల్లో టీకా తయారీకి తగిన ఏర్పాట్లు లేవన్నారు. అందువల్ల ఆయా దేశాలకు నేరుగా టీకాలను విరాళంగా ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని సూచించారు.

ఈయూ చర్చలు...

మరోవైపు అమెరికా, ఫ్రాన్స్​ నిర్ణయాలతో ఇప్పుడు ప్రజల చూపు ధనిక దేశాలపై పడింది. ముఖ్యంగా ఐరోపా సమాఖ్య తీరు ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశమైంది. అమెరికా నిర్ణయం కరోనా టీకాల తయారీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అనే విషయంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు 27 దేశాల సమాఖ్య వెల్లడించింది. పోర్చుగల్​ వేదికగా.. శుక్రవారం ప్రారంభంకానున్న రెండు రోజుల సదస్సులో దీనిపై చర్చించినున్నట్టు పేర్కొంది.

ఇదీ చూడండి:- అమెరికా 'మేధో హక్కుల' నిర్ణయంపై భారత్ హర్షం

ప్రస్తుతానికైతే.. అమెరికా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు మాత్రమే ఈయూ ప్రకటించింది. కానీ ఆ నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందా? లేదా? అన్న విషయంపై మాత్రం ఈయూ స్పష్టతనివ్వలేదు.

'పేద దేశాలకు అండగా..'

భారీ ఔషధ సంస్థలున్న అమెరికా, ఫ్రాన్స్​ దేశాలు మేథో సంపత్తి హక్కుల రద్దుకు నిర్ణయం తీసుకోవడం.. పేద దేశాలకు కలిసివచ్చే విషయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీ సంస్థలకు వ్యాక్సిన్​ ఫార్ములా అందుతుందని.. ఇది చాలా మంచి విషయమని అంటున్నారు.

'లాభం లేదు...'

అయితే అమెరికా బయోఫార్మా రీసర్చ్​ కంపెనీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న పీహెచ్​ఆర్​ఎమ్​ఏ సంస్థ.. అధ్యక్షుడు జో బైడెన్​ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. దీని వల్ల పబ్లిక్​-ప్రైవేట్​ భాగస్వామ్యుల మధ్య గందరగోళం ఏర్పడుతుందని పేర్కొంది. ఫలితంగా.. ఇప్పటికే బలహీనంగా ఉన్న సరఫరా వ్యవస్థ మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఇదీ చూడండి:- ఆకలి సంక్షోభం- 15.5కోట్ల మందిపై ప్రభావం

ఇంటర్నేషనల్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఫార్మా మ్యానుఫ్యాక్చరర్స్​ అండ్​ అసోసియేషన్స్​ కూడా ఇదే విధంగా స్పందించింది. పేద దేశాలకు టీకా అందే ప్రక్రియ వేగంగా జరగాలంటే.. అందుకు మేథో సంపత్తి హక్కులను రద్దు చేసి లాభం లేదని.. ధనిక దేశాలు తమ టీకాలను పంచుకోవడమే మార్గమని తేల్చిచెప్పింది. కరోనా టీకా రూపొందించడం చాలా క్లిష్టమైన విషమని.. మేథోసంపత్తి హక్కులను రద్దు చేసినంత మాత్రాన ఏమీ జరిగిపోదని పేర్కొంది.

'డబ్ల్యూటీఓ పని మొదలుపెట్టాలి...'

కరోనా టీకాల మేథో సంపత్తి హక్కులను రద్దు చేయాలన్న భారత్​, దక్షిణాఫ్రికా ప్రతిపాదనకు అమెరికా మద్దతివ్వడం వల్ల.. ఆ ప్రతిపాదనను ఖరారు చేసేందుకు డబ్ల్యూటీఓ(ప్రపంచ వాణిజ్య సంస్థ) సభ్య దేశాలు సంప్రదింపులు జరపడం మొదలుపెట్టాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎంత వీలైతే అంత తొందరగా సంప్రదింపులను పూర్తి చేసి.. ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ఇది సరిపోతుందా?

మేథో సంపత్తి హక్కులను రద్దు చేసినప్పటికీ.. టీకా ఉత్పత్తిలో అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ హక్కులను రద్దు చేసి.. తయారీ సంస్థలకు ఫార్ములాను అందించినా.. ఉత్పత్తి చేసే సమర్థ్యం ఎన్ని కంపెనీలకు ఉందన్నది ప్రశ్నార్థకమని విశ్లేషకులు అంటున్నారు. ముడిసరకు అందించడం, సరఫరా వ్యవస్థ బలహీనపడకుండా చూసుకోవడం సవాలుతో కూడిన వ్యవహారమని చెబుతున్నారు. దీర్ఘకాలంలో ఈ నిర్ణయం చేటు చేస్తుందని.. ఆవిష్కరణలు చేసే వారికి ప్రోత్సాహకాలు తగ్గిపోతాయని అంటున్నారు.

మరోవైపు మరో అతిపెద్ద అడ్డంకి ఇక్కడ ఒకటి ఉంది. 164 సభ్య దేశాలున్న డబ్ల్యూటీఓలో.. ఏ ఒక్క దేశమైనా.. ఈ ప్రతిపాదనను అడ్డుకోవచ్చు.

ఇదీ చూడండి:- భారత్​లో కరోనా.. ప్రపంచానికి ప్రమాద ఘంటిక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.