చిన్నారులు బరువు తక్కువున్నా.. ఎక్కువైనా ప్రమాదమే. ఐదేళ్లలోపు చిన్నారులు అధిక బరువు ఉంటే వారి ఎముకలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఓ నివేదిక వెల్లడించింది. సాధారణ బరువు ఉన్నవారితో పోల్చితే ఆ ప్రమాదం అధికంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ నివేదిక జర్నల్ ఆఫ్ బోన్ అండ్ మినరల్ రీసెర్చ్‌లో ప్రచురితమైంది.
ఐదేళ్లలోపు పిల్లలపై పరిశోధన
ఈ అధ్యయనంలో ఐదేళ్లలోపు వయసున్న 4,66,997 మంది పిల్లల ఎత్తు, బరువుపై పరిశోధన చేశారు. వీరిలో తక్కువ బరువు కలిగిన వారిలో 9.20 శాతం, సాధారణ బరువు వారిలో 10.06 శాతం, అధిక బరువు వారిలో 11.28 శాతం, ఉబకాయుల్లో 13.05 శాతం మేర ఎముకలు విరగే ప్రమాదం ఉన్నట్లు తేల్చింది నివేదిక. సాధారణ బరువుతో పోలిస్తే, అధిక బరువు ఉన్న పిల్లల్లో 42 శాతం, ఉబకాయం ఉన్న వారిలో 74 శాతం కాలి ఎముకలు దెబ్బతినడం గుర్తించారు. అంతే కాకుండా అధిక బరువు ఉన్న చిన్నారులు 10 శాతం, ఉబకాయం ఉన్న చిన్నారుల్లో 19 శాతం శరీర ఎముకలు దెబ్బతిన్నట్లు స్పష్టం చేసింది.
" స్పెయిన్‌లోని కాటలోనియాకు చెందిన దాదాపు ఐదు లక్షలు మంది పిల్లల్లో ప్రీ- స్కూల్ వయసులో అధిక బరువు, ఊబకాయం వంటి వాటివల్ల బాల్యంలోనే అనేక ప్రమాదాలకు గురైనట్లు గుర్తించాం. వీటికి సంబంధించి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు అవసరం. "
-- డేనియల్ ప్రిటో అల్హాంబ్రా, రచయిత, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, యూకే
ఇదీ చదవండి: లాక్డౌన్ ముగిశాక 'వుహాన్' ప్రజలు ఏం చేస్తున్నారు?