ETV Bharat / international

'ఆక్స్​ఫర్డ్ టీకాతో రక్తం గడ్డకట్టే రేటులో పెరుగుదల'

author img

By

Published : May 7, 2021, 5:30 AM IST

సాధారణ ప్రజలతో పోల్చితే.. ఆక్స్​ఫర్డ్ టీకా తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టే రేటులో స్వల్ప పెరుగుదల నమోదైనట్లు డెన్మార్క్, నార్వేల్లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 18- 65 ఏళ్ల మధ్యలో ఉన్న 2.80 లక్షల మందిపై ఈ అధ్యయనం చేశారు. ఇది కేవలం పరిశీలనాత్మక సర్వే మాత్రమేనని, ఎటువంటి కారణాన్ని ఖరారు చేయలేమని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

AstraZaneca COVID shot
ఆక్స్​ఫర్డ్ టీకా

సాధారణ ప్రజలతో పోల్చితే ఆక్స్​ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 టీకా తొలి డోసు తీసుకున్న వారిలో మెదడులో సహా సిరల్లో రక్తం గడ్డ కడుతున్న రేట్లు స్వల్పంగా పెరిగినట్లు తాజాగా డెన్మార్క్ నార్వే దేశాల్లో నిర్వహించిన భారీ అధ్యయనంలో గుర్తించారు. అయినప్పటికీ ఇటువంటి ప్రతికూల సంఘటనల ప్రభావం తక్కువగా పరిగణించడం జరుగుతుందని అధ్యయన కర్తలు స్పష్టం చేశారు. ఆ వివరాలు బుధవారం 'ద బీఎంజే'లో ప్రచురితమయ్యాయి.

సరిపోల్చి చూడగా..

దక్షిణ డెన్మార్క్ విశ్వవిద్యాలయం, నార్వేయన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్​లు రెండు దేశాల్లో ఆక్స్​ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 టీకా తొలి డోసు తీసుకున్న వారిలో, సాధారణ ప్రజల్లో రక్తం గడ్డ కడుతున్న రేట్లు, ఇతర సంబంధిత అంశాలను సరిపోల్చారు. డెన్మార్క్, నార్వేల్లో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి 11 వరకు ఆక్స్​ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 టీకా (భారత్ లో కొవిషీల్డ్) తొలిడోసు తీసుకున్న 18- 65 ఏళ్ల మధ్యలో ఉన్న 2.80 లక్షల మందిని పరీక్షించారు. ఇందుకోసం జాతీయ ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించారు.

లక్ష డోసులకు 11 కేసులు..

టీకా తొలి డోసు తీసుకున్న వారిలో 22 రోజుల్లోపు గుండెపోటు, సిరల్లో రక్తం గడ్డ కట్టడం, రక్తస్రావం వంటి సంఘటనలను నమోదు చేశారు. అనంతరం సాధారణ ప్రజలతో పోల్చి రేట్లను గణించారు. మొత్తం 59 రక్తం గడ్డకట్టిన సందర్భాలను గుర్తించారు. పరిశోధకుల అంచనా ప్రకారం 30 జరగాలి. వాస్తవంగా చూస్తే ప్రతి లక్ష టీకా డోసులకు 11 కేసులు (రక్తం గడ్డకట్టడం) అధికంగా నమోదయ్యాయి. ఇందులో 'మెదడు సిరల్లో రక్తం గడ్డకట్టడం (సీవీటీ)' ఘటనలూ అధికంగా (ప్రతి లక్ష టీకా డోసులకు 2.5 మేర) ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. గుండెపోటు (ధమనుల్లో రక్తం గడ్డకట్టడం) వంటివి మాత్రం పెరగలేదని తాము గుర్తించినట్లు వెల్లడించారు. ఇది కేవలం పరిశీలనాత్మక సర్వే మాత్రమేనని, ఎటువంటి కారణాన్ని ఖరారు చేయలేమని, కేవలం అంశాల మధ్య సహసంబంధాన్ని మాత్రమే విశ్లేషించామని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'మేథో హక్కుల రద్దు'కు పెరుగుతున్న మద్దతు.. కానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.