డెన్నిస్ తుపాను బ్రిటన్ను గజగజలాడించింది. నెలరోజులు పాటు కురవాల్సిన వర్షం కేవలం రెండు రోజుల్లోనే పడింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రజలను అధికారులు పునరావాసకేంద్రాలకు తరలిస్తున్నారు. తుపాను ధాటికి ఇప్పటికే ఎనిమిది మంది చనిపోయారు.
ఎటు చూసినా నీరే..
నివాసాలు, వ్యాపార సముదాయాల్లో ఇలా ఎటు చూసినా నీరే దర్శనమిస్తోంది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. నదుల్లో నీరు ఆనకట్టలు తెంచుకొని ప్రవహిస్తున్నాయి.
డెన్నిస్ ప్రభావం తీవ్రంగా ఉండడం వల్ల అనేక ప్రాంతాల్లో రెడ్అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ . 2015 డిసెంబరు తర్వాత రెడ్అలర్ట్ జారీ చేయడం ఇదే తొలిసారి. ఉత్తర వేల్స్‌లోని అబెర్డరోన్‌లో శనివారం గంటకు 146 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఇదీ చదవండి: కరోనా పంజా: ఏ దేశంలో ఎన్ని కేసులు?