ETV Bharat / international

కరోనా తీవ్రత తగ్గుముఖం- క్రమంగా ఆంక్షల ఎత్తివేత! - lock down rules news

కరోనా తీవ్రత రోజురోజుకు తగ్గుతున్న నేపథ్యంలో కొన్ని దేశాలు లాక్​డౌన్ నిబంధనలను సడలించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా ఉండేందుకు నిర్ణయాత్మక చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు, పాఠశాలలకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాయి.

VIRUS-GLOBAL-RESPONSE
కరోనా
author img

By

Published : Apr 27, 2020, 1:19 PM IST

కరోనా కేసులు తగ్గుతున్న వేళ పలు దేశాలు లాక్​డౌన్​ ఆంక్షలను సడలించేందుకు సిద్ధమవుతున్నాయి. న్యూజిలాండ్​లో కఠిన లాక్​డౌన్​ నిబంధనలను ఈ రోజు అర్ధరాత్రి నుంచి సడలించనుంది అక్కడి ప్రభుత్వం. దేశంలో సామాజిక వ్యాప్తి లేదని ప్రకటించిన న్యూజిలాండ్ ప్రధాని జెంసిండా అడెర్న్.. భౌతిక దూరం నిబంధన అమలు చేస్తూనే మినహాయింపులు ఇచ్చారు.

వైరస్​ వల్ల తీవ్రంగా ప్రభావితమైన ఐరోపా దేశాలు ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించేందుకు విధానాలను రూపొందిస్తున్నాయి. స్పెయిన్​లో 14 ఏళ్లలోపు పిల్లలను ఆడుకునేందుకు బయటకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. మరిన్ని మినహాయింపులను స్పానిష్ ప్రధాని పెడ్రో సాంచెజ్​ మంగళవారం ప్రకటించనున్నారు.

విధుల్లోకి జాన్సన్​..

కరోనా నుంచి కోలుకున్న అనంతరం.. బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ ఇవాళ్టి నుంచి విధులకు హాజరవుతున్నారు. కొద్దిరోజులుగా ప్రభుత్వ కార్యకలాపాలను బయటి నుంచే నడిపించిన ఆయన తిరిగి పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు.

ఇటలీలో..

ఇటలీలో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత 24 గంటల్లో 260 మంది మరణించారు. ఈ నేపథ్యంలో కర్మాగారాలు, భవన నిర్మాణ పనలు, హోల్​సేల్​ సరఫరా వ్యాపారాలపై ఆంక్షల సడలింపులకు ప్రధాని గిసెప్పీ కాంట్​ పచ్చజెండా ఊపారు. అయితే ప్రభుత్వం సూచించిన భద్రత చర్యలు తీసుకున్న తర్వాతనే కార్యకలాపాలు ప్రారంభించాలని స్పష్టం చేశారు.

మే 4 తర్వాత పార్కులు, తోటలతో పాటు క్రీడాకారులు శిక్షణను కొనసాగించవచ్చని తెలిపారు కాంట్. సమీపంలో ఉన్న బంధువుల ఇళ్లకు వెళ్లవచ్చన్నారు. అన్ని సక్రమంగా జరిగితే మే 18 నాటికి మాల్స్, మ్యూజియాలు.. జూన్​ 1 వరకు రెస్టారెంట్లు, క్షౌర శాలలు తెరిచేందుకు అనుమతి ఇస్తామన్నారు.

అయితే మాస్కుల వాడకం, భౌతిక దూరం పాటించటం తప్పనిసరని స్పష్టం చేశారు ఇటలీ ప్రధాని.

ఇతర ఐరోపా దేశాల్లో..

జర్మనీ అత్యవసరం కాని దుకాణాలు, ఇతర సదుపాయాలను గతవారమే పునఃప్రారంభించింది. డెన్మార్క్​లో ఐదో తరగతి వరకు పాఠశాలలను తెరిచేందుకు అనుమతిచ్చింది.

అగ్రరాజ్యంలో తీవ్రతను బట్టి..

అమెరికాలో వ్యాపారాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల గవర్నర్లపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే ఒత్తిడి తెస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలు వేగంగా ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. జార్జియా, ఓక్లాహామా, అలస్కాలలో పలు వ్యాపారాలను ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చారు. మాంటానాలోని చర్చిల్లో కొన్ని ప్రార్థనలు ప్రారంభమయ్యాయి.

వైరస్ తీవ్రంగా ఉన్న రాష్ట్రాలు న్యూయార్క్, మిచిగాన్​లలో షట్​డౌన్​ కొనసాగించాలని నిర్ణయించారు అక్కడి గవర్నర్లు. మే రెండో వారం వరకూ ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలిచ్చారు.

అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు ఆ దేశంలో 55 వేల మందికిపైగా మరణించారు. 1.18 లక్షల మంది కోలుకున్నారు.

చైనాలో..

వైరస్ పుట్టినిల్లు వుహాన్​ ఆసుపత్రుల్లో కరోనా బాధితుల సంఖ్య సున్నాకు చేరింది. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ పనులను కొనసాగిస్తున్నారు. పరిశ్రమలతోపాటు ఇతర ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

దక్షిణ కొరియాలో కేసుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో పాఠశాలలను తిరిగి ప్రారంభించాలన్న యోచనలో ఉంది ఆ దేశ ప్రభుత్వం.

ఇదీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా తగ్గిన కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.