రష్యా గురువారం సోయుజ్-14 వ్యోమ నౌక ద్వారా రోదసిలోకి పంపిన ఒక హ్యూమనాయిడ్ రోబో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి విజయవంతంగా చేరుకుంది. భూకక్షలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోని వ్యోమగాములకు తోడుగా ఈ రోబోను పంపింది రష్యా.
శనివారమే ఈ రోబో ఐఎస్ఎస్ చేరుకోవాల్సి ఉండగా... చిన్నపాటి సమస్యల కారణంగా నిలిపేశారు. ఫెడోర్గా పిలిచే ఈ మరమనిషి అక్కడే 10 రోజులపాటు గడిపి, వ్యోమగాములకు సాయం చెయ్యడంపై శిక్షణ పొందుతుంది. రష్యా ఇలా రోబోను పంపడం ఇదే తొలిసారి.
గతంలోనూ రోబో ప్రయోగాలు...
ఫెడోర్ కంటే ముందు నాసా 2011లో జనరల్ మోటార్స్‌తో అభివృద్ధి చేసిన రోబోనాట్ 2 అనే హ్యూమనాయిడ్ రోబోను పంపింది. అత్యంత ప్రమాదకరమైన వాతావరణంలోనూ పనిచేయగలిగే విధంగా దానిని రూపొందించారు. 2018లో సాంకేతిక కారణాల వల్ల భూమికి తిరిగి వచ్చింది. 2013లో జపాన్ ఓ చిన్న రోబోను రోదసిలోకి పంపింది.
ఇదీ చూడండి:బురదకాలువలో అంతర్జాతీయ ఈత పోటీలు