తల్లిని సుత్తితో కొట్టి హత్య చేసిన ఓ కొడుకు(son kills mom with hammer).. ఆమె మృతదేహాన్ని రెండు నెలలపాటు ఇంట్లోనే ఉంచాడు. స్నేహితులు, ఇరుగుపొరుగు వారు.. తల్లి గురించి అడిగితే కరోనా సోకిందని, ఐసోలేషన్‌కు వెళ్లిందని చెబుతూ వచ్చాడు. చివరకు నేరం బయటపడటం వల్ల జైలు పాలయ్యాడు. ఈ సంఘటన యూకేలోని వేల్స్ దేశం, పెంబ్రోక్‌షైర్ రాష్ట్రంలో జరిగింది(son kills mother uk).
ఇదీ జరిగింది..
పెంబ్రోక్‌షైర్ రాష్ట్రంలోని పెంబ్రోక్డాక్కు చెందిన జుడిత్ రీడ్ (68), తన కుమారుడు డేల్ మోర్గాన్(43)తో నివసిస్తోంది. ఆమె అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. చివరిసారిగా గత ఏడాది డిసెంబర్ 11న కనిపించినట్లు ఆమె పెంపుడు శునకాన్ని చూసుకునే వ్యక్తి చెప్పాడు. ఇరుగుపొరుగు వారు జుడిత్ గురించి ఆడిగినప్పుడల్లా.. తన తల్లి కరోనా సోకి ఆసుపత్రిలో(Covid isolation) ఉందని చెప్పేవాడు డేల్. ఆమె ఫోన్ నుంచి పలువురికి సందేశాలు కూడా పంపేవాడు. గత ఏడాది క్రిస్మస్కు మూడు రోజుల ముందు తండ్రి కనిపించగా.. జుడిత్ రీడ్ అనారోగ్యానికి గురైందని, ఆమెకు సాయంగా తాను కూడా ఇంట్లోనే ఉంటున్నట్లు చెప్పాడు డేల్.
రెండు నెలలకుపైగా జుడిత్ రీడ్ కనిపించకపోయేసరికి.. ఆమె సన్నిహితులు అధికారులకు సమాచారం అందించారు. డేల్పై అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఇద్దరు పోలీసులు డేల్ ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు.
లోపల ఉన్న చిన్న పడకగది కిటికీ తెరిచి ఉండగా.. అందులోకి చూశారు. దోమ తెరలను పక్కకు జరిపి చూడగానే వారికి భయంకర దృశ్యాలు కనిపించాయి. గదిలో రక్తపు మడుగులో.. బెడ్‌కు సమీపంలో జుడిత్ రీడ్ పడి ఉంది(son kills mom with hammer). ఆమె తలపై ప్లాస్టిక్ బ్యాగ్ కప్పి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
సంఘటనా స్థలంలో తనిఖీలు చేసిన పోలీసులకు.. 745 గ్రాముల బరువైన సుత్తి, రీడ్ రాసిన నోట్ ఆమె ఫోన్ కేస్‌లో దొరికింది. అందులో తన కొడుకు గురించి రాసుకున్నారు రీడ్. డబ్బులు దొంగతనం, డ్రగ్స్‌కు అలవాటు పడినట్లు పేర్కొన్నారు.
పోలీసులు ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ మోర్గాన్ లేడు. కానీ, ఆ మరుసటి రోజున పట్టుకుని కస్టడీకి తరలించారు అధికారులు. అతని తల్లి బ్యాంకు ఖాతాను తనిఖీ చేయగా.. 2020, డిసెంబర్- 2021 జనవరి మధ్య కాలంలో 11 ట్రాన్సాక్షన్స్ చేశాడు మోర్గాన్. మొత్తం 2,878 పౌండ్లు(రూ.2.92 లక్షలు) తీసుకున్నట్లు తేలింది.
పోలీసులు తమదైన శైలీలో విచారించగా.. తానే హత్య చేసినట్లు(son kills mom with hammer) అంగీకరించాడు డేల్. సుత్తితో కొట్టి చంపినట్లు ఒప్పుకున్నాడు.
జీవిత ఖైదు..
తన తల్లిని తానే హత్య చేశానని డేల్ అంగీకరించిన క్రమంలో.. అతనికి జీవిత ఖైదు విధించింది కోర్టు. కనీసం ఇరవై ఒకటిన్నరేళ్ల పాటు జైలు జీవితం గడపాలని స్పష్టం చేసింది. 'ఒక్క మాటలో చెప్పాలంటే.. నువ్వే జీవితంగా ఆమె బతికారు. ఆమె నీ పట్ల చూపించిన 43 ఏళ్ల ప్రేమకు ప్రతిఫలంగా సుత్తితో కొట్టి చంపావు. హత్య చేయాలనే ఉద్దేశంతోనే ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 14 సార్లు కొట్టావు.' అని పేర్కొన్నారు జడ్జి.
ఇదీ చూడండి: సుత్తితో భార్య, పిల్లలపై దాడి- ముగ్గురు మృతి