ETV Bharat / international

ఆ హెల్మెట్​తో 7 మీటర్ల దూరం నుంచే థర్మల్​ స్క్రీనింగ్​!

థర్మల్​ స్క్రీనింగ్... కరోనా ప్రాథమిక లక్షణాలు ఉన్నవారిని గుర్తించేందుకు ఉపయోగిస్తున్న విధానం. సాధారణంగా కార్యాలయాలు, విమానాశ్రయాలు, ఇతర బహిరంగ ప్రదేశాలకు వచ్చేవారి ఉష్ణోగ్రతలను అతి దగ్గర నుంచి థర్మల్ స్క్రీనింగ్ గన్​తో పరీక్షిస్తుంటారు సిబ్బంది. ఇదే పనిని కాస్త స్మార్ట్​గా చేస్తున్నారు ఇటలీలోని ఓ విమానాశ్రయం అధికారులు. అదెలాగో చూడండి.

'Smart helmet' introduced at Rome airport
ఇటలీ ఫ్యూమిసినో విమానాశ్రయంలో స్మార్ట్ హెల్మెట్
author img

By

Published : May 13, 2020, 1:10 PM IST

Updated : May 13, 2020, 3:17 PM IST

ఆ హెల్మెట్​తో 7 మీటర్ల దూరం నుంచే థర్మల్​ స్క్రీనింగ్​!

ఇటలీలో సరికొత్త సాంకేతికత సాయంతో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. రోమ్​లోని ఫ్యూమిసినో విమానాశ్రయంలో స్మార్ట్ హెల్మెట్​తో శరీర ఉష్ణోగ్రతలను పరీక్షిస్తున్నారు. ప్రయాణికులు కదులుతున్నప్పుడే వారి ఉష్ణోగ్రత వివరాలను ఈ అధునాతన పరికరం ద్వారా తెలుసుకోవచ్చు.

'Smart helmet' introduced at Rome airport
స్మార్ట్ హెల్మెట్

భద్రతా సిబ్బంది ఈ పరికరాన్ని ధరించి ఏడు మీటర్ల పరిధిలో ఉన్న వారి శరీర ఉష్ణాన్ని స్మార్ట్ హెల్మెట్ స్క్రీన్​పై చూడవచ్చు. ప్రయాణికుల ఇన్​ఫ్రాడెడ్​ ఇమేజ్​తో పాటు వారి ఉష్ణోగ్రతను కుడి కన్ను ద్వారా చూపిస్తుంది. ఎడమ కన్ను ద్వారా సాధారణ దృశ్యం కనిపిస్తుంది.

స్మార్ట్ హెల్మెట్​ను పరీక్షిస్తున్న ఎయిర్​పోర్ట్ సిబ్బంది

హెల్మెట్ స్క్రీన్​పై ఉష్ణోగ్రత వివరాలు

ఇటలీలోనే ఫస్ట్

ఐరోపాలో ఇటువంటి పరికరం ఉపయోగిస్తున్న తొలి విమానాశ్రయం ఇదేనని స్మార్ట్ హెల్మెట్ పనితీరును పరిశీలిస్తున్న ఎయిర్​పోర్ట్​ ఇంఛార్జ్ సిమోన్లుకా టిబెరియా తెలిపారు. ప్రయాణ ఆంక్షలు సడలించిన తర్వాత ప్రజలకు సురక్షితంగా ఉంటారన్న భరోసా ఇవ్వడానికి ఇలాంటి అత్యున్నత సాంకేతికత పరికరాలు ఉపయోగపడతాయని అన్నారు.

ఫ్యూమిసినో ఎయిర్​పోర్ట్

వచ్చే నెల నుంచి రద్దీ

అధికారికంగా లియోనార్డో డా విన్సీ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలిచే ఈ ఫ్యూమిసినో ఎయిర్​పోర్ట్​ నుంచి ఇటలీ సహా ఐరోపాలోని పలు ప్రాంతాలకు విమానాలు నడుస్తాయి. ప్రస్తుతం కొద్ది సంఖ్యలోనే విమానాలు నడుస్తున్నప్పటికీ.. వచ్చే నెల నుంచి రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Last Updated : May 13, 2020, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.