ఆస్ట్రియా వియన్నా నగరంలోని ఓ ప్రార్థనా మందిరం వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 22 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఓ అధికారి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కొంతమంది బృందంగా ఏర్పడి కాల్పులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. కాల్పులకు తెగబడిన ఓ దుండగుడ్ని పోలీసులు మట్టుబెట్టారు.
అయితే ఇది ఇస్లామిక్ ఉగ్రవాదుల చర్యగా పోలీసులు భావిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ముష్కరుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. భద్రతాబలగాల సెర్చ్ ఆపరేషన్ పూర్తి అయ్యేవరకు ప్రజలు ఎవరూ బయటకు రావద్దని కోరారు.