స్టెమ్ సెల్ మార్పు తర్వాత లండన్‌కు చెందిన ఓ వ్యక్తి హెచ్‌వీఐ బారి నుంచి బయటపడ్డాడని పరిశోధకులు ప్రకటించారు. ఈ ప్రయోగం విజయవంతమై ప్రాణాంతక వైరస్ నుంచి విముక్తి పొందిన రెండో వ్యక్తి ఇతడని తెలిపారు .
ఈ విషయాన్ని ఆన్లైన్ పత్రిక 'నేచర్' ప్రచురించింది.
ఇప్పుడు హెచ్ఐవీ నుంచి బయటపడిన లండన్ వ్యక్తికి... 2003లో ఆ వైరస్ సోకింది. క్యాన్సర్ కూడా వచ్చింది. క్యాన్సర్ చికిత్స కోసం స్టెమ్ సెల్స్ మార్చుకునేందుకు 2016లో అతడు అంగీకరించాడు.
అతడికి చికిత్స చేస్తున్న వైద్యులు ఇది వరకే జన్యుమార్పిడి జరిగిన ఓ దాతను వెతికిపట్టుకున్నారు. అతడి కణాలను లండన్ వాసికి మార్చారు. ఈ మార్పు హెచ్ఐవీ బాధితుడిలోని రోగ నిరోధక వ్యవస్థను మార్చేసింది. దాతకు ఉన్న రోగ నిరోధక శక్తి ఇతడికి వచ్చింది. హెచ్ఐవీ నుంచి విముక్తుడయ్యాడు.
అయితే ఇలాంటి కణాల మార్పు చాలా ప్రమాదకరమని, చాలా మందికి ఈ ప్రయోగం విఫలమైందని పరిశోధకులు చెబుతున్నారు.