ETV Bharat / international

అఫ్గాన్​పై జీ7 దేశాల చర్చ- తాలిబన్లకు హెచ్చరిక! - అఫ్గానిస్థాన్ జీ7 అత్యవసర సమావేశం

అఫ్గానిస్థాన్ అంశంపై అత్యవసర సమావేశం నిర్వహించి చర్చలు జరిపిన జీ7 కూటమి దేశాధినేతలు(G7 leaders meeting on Afghanistan).. ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అఫ్గాన్​లోని విదేశీయులను, భాగస్వాములను సురక్షితంగా తీసుకురావడమే తమ ప్రాధాన్యమని పేర్కొన్నారు. అఫ్గాన్ భూభాగం ఉగ్రవాదులకు ఆశ్రయంగా మారకూడదని స్పష్టం చేశారు.

G7 meeting on Afghanistan
అఫ్గాన్​పై జీ7 దేశాల చర్చ- తాలిబన్లకు హెచ్చరిక!
author img

By

Published : Aug 24, 2021, 11:16 PM IST

అఫ్గాన్​లో చిక్కుకుపోయిన విదేశీయులను, తమకు సహకరించిన వారిని సురక్షితంగా అక్కడి నుంచి తీసుకురావడమే తమ ప్రాధాన్యమని జీ7 దేశాధినేతలు ఉద్ఘాటించారు. అఫ్గాన్ పరిస్థితిపై చర్చించేందుకు అత్యవసర వర్చువల్ సమావేశం నిర్వహించిన అనంతరం(G7 leaders meeting on Afghanistan ) సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్(British PM Boris Johnson) అధ్యక్షత వహించారు. భేటీ తర్వాత విలేకరులతో మాట్లాడిన ఆయన.. తాలిబన్లతో భవిష్యత్ సంప్రదింపుల విషయమై రూపొందించిన ఓ రోడ్​మ్యాప్​ను నేతలు ఆమోదించారని తెలిపారు.

అమెరికా, నాటో దళాల ఉపసంహరణకు చివరి తేదీ అయిన ఆగస్టు 31(US troops withdrawal deadline) తర్వాత కూడా పౌరుల తరలింపు ప్రక్రియకు తాలిబన్లు సహకరించాలని బోరిస్ స్పష్టం చేశారు. సురక్షితంగా వారిని తరలిస్తామన్న హామీ ఇవ్వాలని పేర్కొన్నారు. ఇదే జీ7 దేశాల ప్రథమ షరతు అని అన్నారు.

'ఉగ్రస్థావరం కావొద్దు'

మరోవైపు, అఫ్గాన్​లో పరిస్థితిపై ఉమ్మడి ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు జీ7 దేశాధినేతలు(G7 leaders). ప్రాంతీయ సుస్థిరతను తీసుకొచ్చే ప్రభుత్వం ఏర్పాటు అయ్యే దిశగా.. అన్ని వర్గాలు పనిచేయాలని పిలుపునిచ్చారు. అఫ్గాన్ ప్రజలు గౌరవంగా, శాంతియుత వాతావరణంలో జీవించే పరిస్థితి ఉండాలని అన్నారు. అఫ్గాన్ భూభాగం ఉగ్రవాదులకు ఆశ్రయంగా మారకూడదని స్పష్టం చేశారు. అఫ్గాన్ సమస్యలను పరిష్కరించేందుకు అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేస్తామని చెప్పారు.

'జవాబుదారీ చేస్తాం'

అదేసమయంలో, అఫ్గానిస్థాన్​లో పరిణామాలను గమనిస్తూ ఉంటామని జీ7 దేశాధినేతలు స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని అరికట్టడం, మహిళల హక్కులు కాపాడే విషయంలో తాలిబన్లను జవాబుదారీగా చేస్తామని తేల్చి చెప్పారు. దేశ సుస్థిరతను కాపాడటం, అంతర్జాతీయ నిబంధనలను పాటించడం వంటి అంశాలపై అఫ్గాన్ భవిష్యత్ ప్రభుత్వ చట్టబద్ధత ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: అమెరికాకు తాలిబన్ల వార్నింగ్​.. డెడ్​లైన్​ ఫిక్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.