సైబీరియాలో సముద్రంలో చేపల వేటకు వెళ్లి మంచు ఫలకాలపై చిక్కుకున్న 536 మంది మత్స్యకారులను రష్యా అత్యవసర బృందాలు రక్షించాయి. ఏడు గంటల ఆపరేషన్ అనంతరం వీరిని వెనక్కి తీసుకువచ్చారు సిబ్బంది.
మంగళవారం 60 మంది తమంతట తామే సురక్షితంగా వెనక్కి వచ్చారు. ప్రతికూల వాతావరణ పరిస్ధితులు ఏర్పడే ప్రమాదం ఉన్నందున చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరిస్తున్నా మత్స్యకారులు పట్టించుకోవడం లేదని స్ధానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: కరోనాకు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న అమెరికా!