ETV Bharat / international

శాంతి బాటలో రష్యా .. ఉక్రెయిన్ సరిహద్దు నుంచి సైన్యం వెనక్కి! - రష్యా ఉక్రెయిన్ యుద్ధం విరమణ

Russia vs Ukraine: ఉక్రెయిన్​లో సరిహద్దు సమీపంలో మోహరించిన దళాలను రష్యా వెనక్కి పిలిచింది. వీరంతా సరిహద్దు నుంచి తమతమ స్థావరాలకు వెళ్తున్నారని తెలిపింది.

russia vs ukraine
russia vs ukraine
author img

By

Published : Feb 15, 2022, 2:57 PM IST

Updated : Feb 15, 2022, 4:01 PM IST

Russia vs Ukraine: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం చల్లారే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో మోహరించిన తమ దళాల్లో కొన్నింటిని వెనక్కి పిలుస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఆ సైనికులంతా తమ స్థావరాలకు వెనుదిరుగుతున్నారని తెలిపింది.

Russia military returning

ఉక్రెయిన్ సంక్షోభానికి కారణమైన భద్రతా పరమైన అంశాలపై తాము చర్చలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే.. విన్యాసాల్లో పాల్గొన్న కొన్ని యూనిట్ల సైన్యం తిరిగి తమ స్థావరాలకు పయనమైందని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.

ఉక్రెయిన్​పై రష్యా దండెత్తనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి 16న రష్యా దాడి చేసే అవకాశం ఉందని అమెరికా, బ్రిటన్​లు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో జర్మనీ వంటి దేశాలు శాంతి చర్చలు జరుపుతున్నాయి. అయితే, సమస్య పరిష్కారమయ్యే దిశగా ఎలాంటి ముందడుగు పడలేదు. ఈ నేపథ్యంలో రష్యా చేసిన తాజా ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నిర్ణయంతో యుద్ధం నివారించే అవకాశాలు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ప్రపంచానికి సందేశం ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఉక్రెయిన్ సరిహద్దులో లక్షా 30 వేలకు పైగా సైన్యాన్ని రష్యా మోహరించింది. ఉత్తర, దక్షిణ, తూర్పు సరిహద్దులన్నింటినీ చుట్టుముట్టింది. ఉక్రెయిన్ సరిహద్దును పంచుకునే బెలారస్​లో భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. దీంతో యుద్ధం అనివార్యమనే ఆందోళనలు మొదలయ్యాయి.

Russia Ukraine US

రష్యా నిర్మాణాత్మకంగా వ్యవహరించి చర్చల మార్గాన్ని ఎంచుకుంటే దౌత్యపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఇంకా మిగిలే ఉందని అమెరికా పేర్కొంది. అయితే, రష్యా సైన్యం ఇంకా దాడికి సంసిద్ధంగా ఉన్నట్లే కనిపిస్తోందని అగ్రరాజ్య అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: రష్యా ద్విముఖ వ్యూహం.. చర్చలకు సై అంటూనే సైనిక మోహరింపులు!

Last Updated : Feb 15, 2022, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.