ETV Bharat / international

ఉక్రెయిన్​పై పుతిన్​ ఆగ్రహానికి కారణం వారేనా?

Russia Ukraine War: ఉక్రెయిన్​పై రష్యా చేపడుతున్న దాడులకు ఆ దేశంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతున్నా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ వెనకడుగు వేయడం లేదు. నియో-నాజీలను అంతం చేసేవరకు తమ ఆపరేషన్​ ఆపమని పుతిన్​ అనేకసార్లు ఉద్ఘాటించారు. ఇంతకీ ఎవరు ఈ నియో-నాజీలు? పుతిన్​ వీరిని ఎందుకు టార్గెట్​ చేశారు?

russia ukraine war
రష్యా ఉక్రెయిన్ యుద్ధం
author img

By

Published : Mar 15, 2022, 8:21 AM IST

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టినట్లు ప్రకటించిన సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిల్లో నియో-నాజీలు అనే పదాన్ని వాడారు. ఉక్రెయిన్‌లో నియో-నాజీలను అంతం చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత కూడా రష్యా ప్రకటనల్లో పలుసార్లు ఆ ప్రస్తావన వచ్చింది. ఇటీవల ఓ ప్రసూతి ఆసుపత్రిపై దాడి చేసిన సమయంలో కూడా సమర్థించుకొనేందుకు.. నియో-నాజీలు దానిని ఆక్రమించారని పేర్కొంది. అసలెవరు ఈ నియో-నాజీలు..? వారిపై పుతిన్‌కు ఎందుకంత కోపం..? ఉక్రెయిన్‌ చేసిన తప్పేంటీ..? మేరియుపోల్‌ నగరాన్ని లక్ష్యంగా చేసుకొని రష్యా మొదటి నుంచి తీవ్ర స్థాయిలో దాడులు ఎందుకు చేస్తోంది..? ఇక్కడ అమెరికా ద్వంద్వ వైఖరి ఎందుకు బయటపడుతోంది..?

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో చాలా చోట్ల నాజీ ఆలోచనా తీరు అంతంకాలేదు. చాలా సాంప్రదాయ, మిలిటెంట్‌, రాజకీయ గ్రూపులు ఆ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి.. శ్వేత జాతి అహంకార ధోరణిని పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. సాధారణంగా ఇటువంటి వాటిని నియో-నాజీ గ్రూపులు అంటారు. ఉక్రెయిన్‌లో కూడా ఇటువంటి ఒక సాయుధ గ్రూపు 2014 నుంచి పనిచేస్తోంది. దానిపేరు అజవో బెటాలియన్‌..!

2014 మేలో తూర్పు ఉక్రెయిన్‌లో పేట్రియాట్‌ ఆఫ్‌ ఉక్రెయిన్‌, సోషల్‌ నేషనల్‌ అసెంబ్లీ అనే గ్రూపుల నుంచి వచ్చిన వారితో అజోవ్‌ బెటాలియన్‌ ఏర్పాటు చేశారు. జాతి విద్వేష, నియో-నాజీ భావజాలం వ్యాప్తి చేయడం, శరణార్థులపై, రోమా జాతి ప్రజలపై, తమను వ్యతిరేకించే వారిపై దాడులు చేయడం వంటివి చేస్తున్నారు. వీరు ఓ బెటాలియన్‌ వలే డొనెట్స్క్‌ ప్రాంతంలో రష్యా అనుకూల వేర్పాటు వాదులపై దాడులు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారు రష్యా అనుకూల వేర్పాటు వాదుల నుంచి మేరియుపోల్‌ పోర్టు సిటీని స్వాధీనం చేసుకొన్నారు. దీంతో వీరిని 2014 నవంబర్‌లో ఉక్రెయిన్‌ నేషనల్‌ గార్డ్స్‌ విభాగంలో కలిపారు. నాటి అధ్యక్షుడు పెట్రో పొరొషెంకో వీరిని పొగడ్తలతో ముంచెత్తారు. 'వీరు మా అత్యుత్తమ యోధులు' అంటూ పేర్కొన్నారు.

ఎవరు ప్రారంభించారు..

ఈ అజోవ్‌ విభాగాన్ని ఆండ్రీ బిలెన్స్కీ ప్రారంభించారు. ఇతను పెట్రియాట్‌ ఆప్ ఉక్రెయిన్‌(2005), ఎస్‌ఎన్‌ఏ(2008) రెండింటిలో నాయకుడిగా పనిచేశాడు. ఉక్రెయిన్‌లో మైనార్టీ గ్రూపులపై దాడి చేయడంలో ఎస్‌ఎన్‌ఏ పాత్ర ఎక్కువ. 2010లో ఓ సందర్భంలో బిలెన్స్కీ వివాదాస్పద ప్రకటన చేశాడు. "తక్కువ స్థాయి జాతులకు వ్యతిరేకంగా జరిగే చివరి క్రూసేడ్‌లో శ్వేతజాతీయులు నాయకత్వం వహించడం" ఉక్రెయిన్‌ జాతీయ లక్ష్యంగా ప్రకటించినట్లు అల్‌-జజీరా పత్రిక కథనంలో పేర్కొంది. బిలెన్స్కీ 2014లో ఉక్రెయిన్‌ పార్లమెంట్‌కు ఎంపికయ్యాడు. అక్కడి చట్టం ప్రకారం ప్రజా ప్రతినిధి పోలీస్‌, సైన్యంలో అధికారిగా ఉండకూడదు. అందుకే అజోవ్‌ యూనిట్‌ నుంచి బయటకు వచ్చేశాడు. 2019 వరకు అతడు ఎంపీగా పనిచేశాడు. 2016లో అతివాద నేషనల్‌ కార్ప్స్‌ పార్టీని ప్రారంభించాడు. దీనిలో అజోవ్‌ బెటాలియన్‌ సభ్యులే కీలక పాత్ర పోషించారు.

ఉక్రెయిన్‌ ఒలిగార్క్‌ల నుంచి నిధులు..

అజోవ్‌ బెటాలియన్‌కు ఉక్రెయిన్‌లోని ఒలిగార్క్‌ల నుంచి నిధులు అందాయి. రష్యాకు చెందిన ఎనర్జీ వ్యాపార దిగ్గజం ఇగోర్‌ కోలోమొయిస్కీ నుంచి సొమ్ములు అందాయి. దీంతోపాటు మరో ఒలిగార్క్‌ షెర్రీ టారుటా కూడా విరాళాలు ఇచ్చారు. ఇతను డొనెట్స్క్ ప్రాంతానికి గవర్నర్‌గా పనిచేశారు.

అజోవ్‌ బెటాలియన్‌ గుర్తులు, యూనిఫామ్‌లు జర్మనీ నాజీలను పోలి ఉంటాయి. 2018లో అజోవ్‌ బెటాలియన్‌ కీవ్‌లో స్ట్రీట్‌ పెట్రోల్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్‌ రోమా కమ్యూనిటీ, ఎలజీబీటీక్యూలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టింది. మూడు ఖండాల నుంచి కరుడుగట్టిన శ్వేతజాతి భావజాలం ఉన్నవారు కూడా దీనిలో చేరి సైనిక శిక్షణ వంటివి పొందడానికి ఆసక్తి చూపారు. అమెరికాలోని అతివాదులు కూడా ఇక్కడ సైనిక శిక్షణకు వెళుతున్నట్లు ఇటీవల యూఎస్‌ఏటుడే కథనం పేర్కొంది.

విమర్శల వెల్లువ..

  • ప్రపంచంలో నియో-నాజీలను సైన్యంలో పెట్టుకొన్న దేశం ఒక్క ఉక్రెయిన్‌ మాత్రమే అని 2019లో అమెరికాకు చెందిన 'ది నేషన్‌' పత్రిక పేర్కొంది.
  • అంతర్జాతీయ మానవ హక్కులను అజోవ్‌ బెటాలియన్‌ ఉల్లంఘిస్తోందని 2016లో ఐరాస మానవ హక్కుల కమిషనర్‌ ఆఫీస్‌ ఇచ్చిన నివేదిక పేర్కొంది. ఆ నివేదికలో నవంబర్‌ 2015 నుంచి ఫిబ్రవరి 2016 వరకు అజోవ్‌ బెటాలియన్‌ చేసిన దురాగతాలను వెల్లడించింది. పౌర భవనాల్లో బలవంతంగా ఆయుధాలను భద్రపర్చడం, పౌరుల ఆస్తులను దోచుకొని వారిని తరిమి వేయడం, ఖైదీలను హింసించడం, అత్యాచారాలు చేయడం వంటివి చేసినట్లు పేర్కొంది.
  • 2015 జూన్‌లో కెనడా, అమెరికా దళాలు అజోవ్‌ రెజిమెంట్‌కు సహకరించవని ప్రకటించాయి. నియో-నాజి సంబంధాల కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నాయి. ఆ తర్వాత సంవత్సరాల్లో పెంటగాన్‌ నుంచి ఒత్తిడి రావడం వల్ల ఈ బ్యాన్‌ అమెరికా ఉపసంహరించుకొంది.
  • 2019లో అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధి మాక్స్‌ రోజ్‌ నాయకత్వంలోని 40 మంది సభ్యులు అజోవ్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని ఓ లేఖను సమర్పించారు. గతేడాది ఏప్రిల్‌లో కూడా వేరే ప్రతినిధి ఎల్సా స్లోట్‌కిన్‌ మరోసారి బైడెన్‌ సర్కారును ఇదే అంశం పై కోరారు.

ఫేస్‌బుక్‌ గందరగోళం..

2016లో ఫేస్‌బుక్‌ అజోవ్‌ రెజ్‌మెంట్‌ను ప్రమాదకర బృందంగా పేర్కొంది. 2019లో ఏకంగా ఫేస్‌బుక్‌ నుంచి అజోవ్‌ను బ్యాన్‌ చేసింది. ఐసిస్‌, కు క్లుక్స్‌ క్లాన్‌ వంటి ప్రథమశ్రేణి ప్రమాదకర గ్రూపులతో సమాన హోదా ఇచ్చింది. అంటే ఈ గ్రూపును సదరు సామాజిక వేదికపై పొగిడినా.. మద్దతు ఇచ్చినా.. ప్రాతినిధ్యం వహించినా.. వారిని కూడా బ్యాన్‌ చేస్తారు. కానీ, ఫిబ్రవరి 24వ తేదీన రష్యా సైనిక చర్య మొదలుపెట్టగానే.. అజోవ్‌పై బ్యాన్‌ను తొలగించడం విశేషం. గతంలో చాలా పశ్చిమ దేశాల పత్రికలు అజోవ్‌పై చేసిన ప్రతికూల కథనాలు యూట్యూబ్‌లో ఇప్పటికీ ఉన్నాయి. వాస్తవానికి అజోవ్‌కు ఉక్రెయిన్‌ చట్టసభల్లో కేవలం 2శాతం ప్రాతినిధ్యమే ఉంది. అలాంటప్పుడు దీనిని సాకుగా చూపి దాడి చేయమేంటన్నది పశ్చిమదేశాల వాదన.

ఇదీ చూడండి : ఉక్రెయిన్​పై భీకర దాడులు.. నో ఫ్లైజోన్​ ప్రకటనకు జెలెన్​స్కీ వినతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.