ETV Bharat / international

రష్యాపై ఈయూ కఠిన ఆంక్షలు.. దౌత్య సంబంధాలకు ఉక్రెయిన్​ స్వస్తి! - ఐరోపా సమాఖ్యం

Russia Ukraine War: ఉక్రెయిన్​పై యుద్ధానికి దిగిన రష్యాపై కఠిన ఆంక్షలకు సిద్ధమైంది ఐరోపా సమాఖ్య. యురోపియన్​ దేశాల నేతల ఆమోదం తెలపగానే అమలులోకి తీసుకురానున్నట్లు యురోపియన్​ కమిషన్​ అధ్యక్షుడు ఉర్సులా వాన్​ డైర్​ లియాన్​ తెలిపారు. రష్యా చర్యను బ్రిటన్​ తప్పుపట్టింది. మరోవైపు.. రష్యాతో దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు ఉక్రెయిన్​ ప్రకటించింది.

Russia
రష్యా
author img

By

Published : Feb 24, 2022, 4:37 PM IST

Russia Ukraine War: అంతర్జాతీయ హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఉక్రెయిన్​పై యుద్ధానికి దిగిన రష్యాపై కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది ఐరోపా సమాఖ్య. బలమైన, అత్యంత తీవ్రమైన ఆంక్షలు విధించాలని ప్రణాళిక రచిస్తున్నట్లు యురోపియన్​ కమిషన్​ అధ్యక్షుడు ఉర్సులా వాన్​ డైర్​ లియాన్​.

"మా లక్ష్యం ఐరోపాలో స్థిరత్వం, అంతర్జాతీయ శాంతికి కట్టుబడి ఉండేలా చూడటం. ప్రస్తుత పరిస్థితులకు అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ జవాబుదారీగా చేస్తాం. రష్యాపై విధించే భారీ, కఠిన ఆంక్షల ప్యాకేజీని యురోపియన్​ నేతల ముందు ఆమోదం కోసం ఉంచాం."

- ఉర్సులా వాన్​ డైర్​ లియాన్​, యురోపియన్​ కమిషన్​ ప్రెసిడెంట్​.

ఈ ఆంక్షల ప్యాకేజీని గతంలో ఎన్నడూ లేని విధమైన కఠిన ఆంక్షలుగా అభివర్ణించారు ఐరోపా సమాఖ్య విదేశాంగ విధాన అధినేత జోసెఫ్​ బొరెల్​.

రష్యా చర్యను తప్పుపట్టిన యూకే..

ఉక్రెయిన్​పై యుద్ధం ప్రకటించి రక్తపాతానికి దారి తీసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ నిర్ణయాన్ని యునైటెడ్​ కింగ్​డమ్​ తప్పుపట్టింది. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలతో కలిసి నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని పేర్కొంది. గురువారం ఉదయమే ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్స్కీతో ఫోన్​లో మాట్లాడారు బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​. ఉక్రెయిన్​లో జరుగుతున్న భయానక పరిస్థితులపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తదుపరి చర్యలపై జెలెన్స్కీతో చర్చించినట్లు ట్వీట్​ చేశారు.

ఉక్రెయిన్​ వైమానిక స్థావారాలు నేలమట్టం: రష్యా

ఉక్రెయిన్​లోని వైమానిక రక్షణ ఆస్తులు, స్థావరాలను నేలమట్టం చేసినట్లు రష్యా సైన్యం ప్రకటించింది.అయితే, ఐదు రష్యా యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఉక్రెయిన్​ ప్రకటించటాన్ని ఖండించింది రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ.

పౌరులకు కీలక సూచనలు చేసిన చైనా..

ఉక్రెయిన్​లో రష్యా దాడుల నేపథ్యంలో ఆ దేశంలోని తమ పౌరులకు కీలక సూచనలు చేసింది చైనా. తమ పౌరులు ఇళ్లల్లోనే ఉండాలని స్పష్టం చేసింది. అయితే, రష్యా బలగాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ మేరకు తమ రాయబార కార్యాలయానికి సామాజిక మాధ్యమాల వేదికగా ఓ నోటీసు జారీ చేసింది జిన్​పింగ్​ ప్రభుత్వం. ప్రస్తుతం పరిస్థితులు గందరగోళంగా, అదుపుచేయలేని స్థితిలో ఉన్నాయని, ముఖ్యంగా ప్రధాన నగరాల్లో ఈ పరిస్థితులు తలెత్తినట్లు వెల్లడించింది. వీధుల్లో వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని, ఏ సమయంలోనైనా ట్రాఫిక్​ను నిలిపవేసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు తాము ప్రమాదంలో ఉన్నట్లు గమనిస్తే స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించింది.

రష్యాతో దౌత్య సంబంధాలు తెంచుకున్న ఉక్రెయిన్..

రష్యా చేస్తున్న దాడులతో ఆ దేశంతో ఉన్న దౌత్యపరమైన సంబంధాలను తెంచుకుంటున్నట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఈ మేరకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ప్రకటన విడుదల చేశారు. దాడి చేయడంతోపాటు తమ భూభాగంలోకి పొరుగు దేశమైన రష్యా సేనలు చొచ్చుకురావడంతో దౌత్యసంబంధాలు తెంచుకునేందుకు సిద్ధమైనట్లు జెలెన్‌స్కీ తెలిపారు. మరోవైపు రష్యా చేస్తున్న దాడిని తిప్పికొట్టేందుకు తమ సైన్యం ఎదురుదాడి చేస్తోందన్న ఉక్రెయిన్‌ అధికారులు... పశ్చిమ దేశాలు రక్షణ సాయం అందించాలని కోరారు.

ఇదీ చూడండి: 'ఇప్పటికే ఆలస్యమైంది.. ఎలాగైనా యుద్ధాన్ని ఆపండి'

ఉక్రెయిన్​లో బాంబుల మోత.. బెలారస్ నుంచి చొరబడ్డ రష్యా సైన్యం

ఉక్రెయిన్​లో వరుస పేలుళ్లు... ప్రభుత్వ సైట్లపై సైబర్ దాడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.