ETV Bharat / international

ఉక్రెయిన్​- రష్యా ఉద్రిక్తతలతో 'వలస' సంక్షోభం.. ప్రాణాలు అరచేత పట్టుకొని..! - ఉక్రెయిన్​ వార్తలు

Ukraine Crisis: ఉక్రెయిన్​పై రష్యా సేనలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో సుమారు 50 లక్షల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దులు దాటుతున్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఇప్పటికే రొమేనియా, హంగరీ, పొలండ్​, స్లోవేకియాలోకి ప్రవేశించారు. చంకలో పిల్లలు, చేతిలో సామాన్లతో తమ ఆత్మీయుల్ని ఆలింగనం చేసుకొని కన్నీటి వీడ్కోలు పలికారు.

Ukraine Crisis
ఉక్రెయిన్​ వలస సంక్షోభం
author img

By

Published : Feb 26, 2022, 4:34 PM IST

Ukraine Crisis: ఉక్రెయిన్, రష్యా ఉద్రిక్తతలు.. మరో వలస సంక్షోభానికి దారితీశాయి. రష్యా దూకుడుగా సైనిక చర్యను కొనసాగిస్తుండటంతో.. సుమారు 50 లక్షల మంది ప్రాణాలు అరచేత పట్టుకొని, సరిహద్దులు దాటి, పొరుగున ఉన్న ఐరోపా దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ విషయాన్ని ఐరాస అనుబంధ సంస్థలు వెల్లడించాయి.

వలసలు ప్రారంభమయ్యాయి. లక్షల్లో ప్రజలు.. మరీ ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఇప్పటికే రొమేనియా, హంగరీ, పొలండ్‌, స్లొవేకియాలోకి ప్రవేశించారు. మగవారు మాత్రం యుద్ధంలో సహకరించేందుకు ఉండిపోయారు. దీనికి సంబంధించి యూఎన్‌ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ వివరాలు వెల్లడించింది. 48 గంటలలోపే 50 వేల మందికి పైగా ఉక్రెనియన్లు దేశం విడిచి వెళ్లిపోయారు. చంకలో పిల్లలు, చేతిలో సామాన్లు పట్టుకొని, తమ ఆత్మీయుల్ని ఆలింగనం చేసుకొని, కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా, దానికి సంబంధించిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో దర్శనమిస్తున్నాయి.

Ukraine Crisis
ఆత్మీయులకు కన్నీటి వీడ్కోలు

రష్యా దళాలు తమ నివాస ప్రాంతాల వద్దకు సమీపించడం, చేతిలో నిత్యావసరాల కొరత ఏర్పడటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఉక్రెనియన్లు దేశం దాటుతున్నారు. వాహనాల వరుసలు బార్లు తీరాయి. పొలండ్‌కు వెళ్లే సరిహద్దు వద్ద ఎముకలు కొరికే చలిలోనే కొన్ని గంటలపాటు ఉండిపోయారు. 'రష్యన్లు దేశం మొత్తాన్ని ఆక్రమిస్తారని మేం భయపడుతున్నాం. మా మగవారిని నిర్బంధిస్తారని ఆందోళనగా ఉంది' అని 44 ఏళ్ల ఎవా మీడియాతో అన్నారు. ఆమె తన ఇద్దరు చిన్నపిల్లలతో కలిసి హంగరీ చేరుకున్నారు. తన భర్త ఉక్రెయిన్‌లోనే ఉండిపోవడంతో 30 ఏళ్ల లుడ్మిలా పోలండ్‌కు చేరుకున్నారు. ఉక్రెయిన్ మహిళల తండ్రులు, భర్తలు.. అక్కడే ఉండిపోయారంటూ.. ఒంటరిగా మిగిలిన ఆమె కన్నీరు పెట్టుకున్నారు. చేతిలో పసికందుతో 36 గంటల పాటు ప్రయాణించిన మరో మహిళ మాట్లాడుతూ..‘గురువారం ఉదయం పేలుళ్ల శబ్దం విన్నాం. బాంబులు, రాకెట్లు దూసుకువచ్చాయి. మేం ఎక్కడికీ వెళ్లడానికి లేదు’ అని వాపోయారు. ఇలా వెళ్తున్నవారికి గమ్యస్థానం అంటూ ఏమీ లేదన్నారు. కొందరు స్థానిక చర్చిల్లో ఆశ్రయం పొందుతున్నారు. కాగా ఉక్రెయిన్‌ నుంచి వెళ్తున్నవారికి ఇతరదేశాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో కొందరు తాత్కాలిక వసతి కల్పిస్తున్నారు.

Ukraine Crisis
ఓ చిన్నారి

ఇదిలా ఉంటే.. ఇతరదేశాల్లో ఉన్న ఉక్రెనియన్లు సొంత దేశానికి తిరిగి వస్తున్నారు. పొలండ్‌ నుంచి వచ్చిన మికొలజ్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'మా దేశాన్ని రక్షించుకోవడానికి మేం తిరిగి వస్తున్నాం. మేం రష్యాకు ఎలాంటి అపకారం చేయలేదు. పుతిన్‌ ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక సంక్షోభం మరువకముందే..

Ukraine Crisis
అఫ్గానిస్థాన్​ను వీడేందుకు విమానాశ్రయం వద్ద ప్రజలు (పాత చిత్రం))

ఏడాది కాలంలో ప్రపంచం చూస్తోన్న రెండో వలస సంక్షోభం ఇది. 2021, ఆగస్టు నెలలో అఫ్గాన్‌లోని పౌర ప్రభుత్వాన్ని కూల్చివేసి, తాలిబన్లు అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. హఠాత్తుగా అమెరికా తన సేనల్ని ఉపసంహరించడంతో అఫ్గాన్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. తాలిబన్ల పాలనలో మునుపటి అరాచకత్వమే ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఎంతో మంది పలు దేశాలకు వలస వెళ్లారు. ఆ సమయంలో విమానాశ్రయాల్లో కనిపించిన దృశ్యాలు ఈ ప్రపంచం ఎన్నటికీ మరువలేదు..! గాల్లోకి లేచిన విమానం అడుగుభాగం పట్టుకొని, దేశం దాటాలని ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు హృదయాలను మెలిపెట్టాయి.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.