ETV Bharat / international

ఉక్రెయిన్​ సైన్యంపై బాంబుల వర్షం.. భయంతో పరుగులు! - రష్యా

Russia Ukraine conflict: ఉక్రెయిన్​ మిలిటరీ ఉన్నతాధికారులపై బాంబు దాడులు చేపట్టారు వేర్పాటువాదులు. దీంతో బాంబు షెల్టర్​లోకి పరుగులు పెట్టారు అధికారులు. వేర్పాటువాద ప్రాంతంలో పర్యటన సందర్భంగా ఈ దాడి జరిగినట్లు అసోసియేటెడ్​ ప్రెస్​ తెలిపింది.

Russia Ukraine conflict
ఉక్రెయిన్​ సైన్యంపై బాంబుల వర్షం
author img

By

Published : Feb 19, 2022, 10:42 PM IST

Russia Ukraine conflict: ఉక్రెయిన్​ మిలిటరీ ఉన్నతాధికారులపై శనివారం సాయంత్రం బాంబు దాడి జరిగింది. తూర్పు ఉక్రెయిన్​లోని వేర్పాటువాదుల యుద్ధ ప్రాంతంలో పర్యటన సందర్భంగా ఈ దాడి జరిగినట్లు అసోసియేటెడ్​ ప్రెస్​ తెలిపింది. ఈ క్రమంలో అధికారులు బాంబు షెల్టర్​లోకి పరుగులు పెట్టినట్లు వారితో ఉన్న అసోసియేటెడ్​ ప్రెస్​ జర్నలిస్ట్​ వెల్లడించారు.

అంతకుముందు తూర్పు ఉక్రెయిన్​లోని రష్యా మద్దతు గల రెండు వేర్పాటువాద ప్రాంతాల నాయకులు తమ బలగాలను సమీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. రెబల్​ ప్రాంతంలో జరుగుతున్న హింసను కారణంగా చూపి రష్యా దాడికి పాల్పడే అవకాశం ఉందన్న భయాల నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

తూర్పు ఉక్రెయిన్​లోని ప్రభుత్వం రెండుసార్లు మోర్టార్​ షెల్స్​ ప్రయోగించినట్లు, అవి సరిహద్దు సమీపంలో పడినట్లు రష్యా శనివారం ఉదయం తెలిపింది. అయితే.. దీనిని ఉక్రెయిన్​ విదేశాంగ మంత్రి మైత్రో కులెబా తోసిపుచ్చారు. అది ఒక తప్పుడు ప్రకటనగా పేర్కొన్నారు. మరోవైపు.. డొనెట్​స్క్​ ప్రాంతంలోని వేర్పాటువాద దళాలు చేసిన దాడిలో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్​ మిలిటరీ పేర్కొంది. రెచ్చగొట్టే చర్యల్లో భాగంగా నివాస ప్రాంతాల్లో ఆయుధాలను మోహరిస్తున్నట్లు ఆరోపించింది.

ఇదీ చూడండి: రష్యా క్షిపణి పరీక్షలు.. ఉక్రెయిన్​ సరిహద్దులో హైటెన్షన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.