విష ప్రయోగానికి గురైనట్లు అనుమానిస్తున్న రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్నీని మెరుగైన చికిత్స కోసం జర్మనీకి తరలించేందుకు సైబిరియా ఆస్పత్రి వైద్యులు అనుమతించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
నావల్నీని తరలించేందుకు.. జర్మనీ నిపుణుల బృందం, వైద్య పరికరాలతో కూడిన ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయమే ఓమ్స్క్ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే.. నావల్నీ పరిస్థితి అస్థిరంగా ఉండటం వల్ల సైబీరియా ఆస్పత్రి వర్గాలలు అందుకు నిరాకరించాయి.
అనంతరం జర్మనీ వైద్యులు నావల్నీని పరీక్షించి.. ప్రత్యేకమైన విమానంలో తరలించేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదని తేల్చారని రష్యన్ డాక్టర్లు వెల్లడించారు.
సైబీరియాలోని ఓమ్స్క్ నగరం నుంచి ఈ విమానం శనివారం ఉదయం జర్మనీకి బయల్దేరనున్నట్లు రష్యాకు చెందిన ఓ వార్తా సంస్థ పేర్కొంది.
విషప్రయోగం!
రష్యా రాజకీయాల్లో కీలక నేతగా, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చిరకాల ప్రత్యర్థిగా పేరుగాంచిన ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీపై సైబీరియాలోని టోమ్స్క్ నుంచి మాస్కోకు విమానంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా స్పృహ తప్పారు. విమానాన్ని అత్యవసరంగా ఓమ్స్క్ నగరంలో ల్యాండ్ చేసి ఆస్పత్రికి తరలించారు. అయితే నావల్నీపై విషప్రయోగమే జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి- రష్యా ప్రతిపక్ష నేతపై విష ప్రయోగం!