ETV Bharat / international

ఉక్రెయిన్​ కొత్త వ్యూహం.. పుతిన్​ 'అణు' ప్రకటనపై నాటో ఆందోళన!

Ukraine Strategy: ఉక్రెయిన్​పై దాడులు చేస్తూ కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటున్నాయి రష్యన్​ బలగాలను. ఈ క్రమంలో వారిని తికమకపెట్టే వ్యూహాన్ని అవలంబిస్తోంది ఉక్రెయిన్​. రహదారులపై సూచిక బోర్డులను మార్చివేయటం, తొలగించటం వంటివి చేస్తోంది. కొన్ని చోట్ల మీకు ఇష్టమైన చోటుకు వెళ్లండి లేదా వచ్చిన దారిలోనే వెళ్లిపోండి అనే పేర్లతో బోర్డులు కనిపిస్తున్నాయి. మరోవైపు.. రష్యా విమానయాన సంస్థలకు షాక్​ ఇస్తున్నాయి పలు దేశాలు.

Ukraine Strategy
ఉక్రెయిన్​
author img

By

Published : Feb 27, 2022, 10:16 PM IST

Ukraine Strategy: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యా దళాలు.. ప్రధాన నగరాల్లోకి దూసుకొస్తున్నాయి. ఇప్పటికే కీవ్‌లోకి ప్రవేశించిన రష్యా సేనలు, తాజాగా ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ఖర్కీవ్‌లోకి ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో రష్యా దళాలను తికమక పెట్టే ఆలోచనలకు ఉక్రెయిన్‌ బృందాలు పదునుపెట్టాయి. ముఖ్యంగా రహదారులపై మార్గాలను తెలిపే సూచిక బోర్డులను మార్చివేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే కొన్ని వేల బోర్డులను తొలగించినట్లు సమాచారం. తద్వారా రష్యన్‌ బలగాలు వెళ్లాల్సిన మార్గం అర్థం కాకుండా గందరగోళ పరిచేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి.

గత నాలుగు రోజుల క్రితం దాడులను మొదలుపెట్టిన రష్యా బలగాలు.. ఉక్రెయిన్‌ ప్రధాన నగరాల వైపు మెరుపు వేగంతో దూసుకొస్తున్నాయి. దీంతో వారిని ఎలాగైనా ఆలస్యం చేయాలనే ఉద్దేశంతో ప్రధాన రహదారుల్లోని సూచిక బోర్డులను తొలగించడం, తప్పుదారి పట్టించేలా వాటికి మార్పులు చేస్తున్నట్లు ఉక్రెయిన్‌ రోడ్డు, రహదారుల నిర్వహణ విభాగం వెల్లడించింది. అంతేకాకుండా వెంటనే రోడ్డమీద ఉండే సూచిక బోర్టులను తొలగించాలని రోడ్డు నిర్వహణ సంస్థలు, స్థానిక అధికారులకు సూచించినట్లు పేర్కొంది. వీటికి సంబంధించి 'మీకు ఇష్టమైన చోటుకు వెళ్లండి, వచ్చిన దారిలోనే రష్యాకు వెళ్లిపోండి..'అనే పేర్లతో మార్పులు చేసిన సూచిక బోర్డుల చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. తద్వారా తమ ప్రాంతాలపై అంతగా అవగాహన లేని శత్రువులను గందరగోళానికి గురిచేయవచ్చని భావిస్తున్నట్లు ఉక్రెయిన్‌ అధికారులు వెల్లడించారు.

దూకుడుగా వస్తున్న రష్యా సేనలు ఇప్పటికే ఖర్కీవ్‌, నోవా కఖోవ్‌కా నగరాల్లోకి ప్రవేశించాయి. ఖర్కీవ్‌లో పోరాటం జరుగుతుండగా.. నోవా కఖోవ్‌కా నగరాన్ని మాత్రం పూర్తిగా అధీనంలోకి తీసుకొన్నాయి. ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్‌ కావడంతో ఆ నగరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. తేలికపాటి రష్యా సాయుధ వాహనాలు నగరంలోకి అడుగుపెట్టినట్లు నగర ప్రాంతీయ కార్యనిర్వాహక విభాగం ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. ఖర్కీవ్‌లోకి రష్యా సాయుధ వాహనాలు ప్రవేశించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

రష్యా విమానయాన సంస్థలకు షాక్‌ ఇస్తున్న దేశాలు..

ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్‌కు నిరసనగా.. ఆయా దేశాలు రష్యా విమానాల కోసం తమ ఎయిర్‌స్పేస్‌ను మూసివేస్తున్నాయి. తాజాగా ఫ్రాన్స్​, స్పెయిన్‌, కెనడా, ఐస్‌ల్యాండ్‌, బెల్జియం, ఫిన్లాండ్‌ తదితర దేశాలు ఈ జాబితాలో చేరాయి. జర్మనీ కూడా ఈ విధమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోన్నట్లు సమాచారం.

మరోవైపు.. స్విఫ్ట్​ నుంచి రష్యా బ్యాంకులను తప్పించటంలో అమెరికా, ఐరోపా దేశాలతో చేతులు కలిపేందుకు సిద్ధమని జపాన్​ ప్రధాని ఫుమియో కిషిదా తెలిపారు.

అణ్వాయుధ దళాలను అలర్ట్​ చేసిన పుతిన్​

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ తమ అణ్వాయుధ దళాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఉక్రెయిన్​పై రష్యా దాడి.. అణ్వాయుధాల వినియోగానికి దారితీస్తుందనే ప్రపంచ దేశాల ఆందోళనలను ఈ ప్రకటన మరింత పెంచినట్లయింది. అయితే, పుతిన్​ ఆదేశాలు ఆమోదయోగ్యం కాదని ఐరాసలోని అమెరికా రాయబారి లిండా థామస్​ గ్రీన్​ఫీల్డ్​ స్పష్టం చేశారు.

పుతిన్‌ 'అణు' హెచ్చరిక ప్రమాదకరం: నాటో

అణ్వాయుద దళాలను అప్రమత్తంగా ఉండాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చేసిన వ్యాఖ్యలను నాటో తప్పుబట్టింది. అలాంటి వ్యాఖ్యలు ప్రమాదకరమని, బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవని నాటో కూటమి సెక్రటరీ జనరల్‌ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ అన్నట్లు ఆయన వ్యాఖ్యలను ఉటంకించింది ఏఎఫ్​పీ న్యూస్​ ఏజెన్సీ.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.