బ్రిటన్ రాజకుటుంబంలో జాత్యహంకార పోకడలు ముమ్మాటికీ లేవన్నారు ప్రిన్స్ విలియం. ఇటీవల ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ ఇచ్చిన సంచలన ఇంటర్వ్యూపై తూర్పు లండన్లోని ఓ పాఠశాలకు హాజరైన సందర్భంగా ఆయన స్పందించారు.
"మాది ఎంతమాత్రం జాత్యహంకార కుటుంబం కాదు. నాటి సంఘటనలను జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు అభిప్రాయభేదాలు ఉండవచ్చు. అయితే వాటిని తీవ్రంగా పరిగణిస్తాం. ఈ వ్యవహారాన్ని కుటుంబం మధ్యలో పరిష్కరించుకుంటాం. హ్యారీ, మేఘన్, ఆర్చీలను ఎప్పటికీ ప్రేమిస్తాం."
- ప్రిన్స్ విలియం
అయితే తాను ఇంతవరకు హ్యారీని కలవలేదని, త్వరలోనే అతడితో మాట్లాడాలనుకుంటున్నట్లు చెప్పారు విలియం. కొన్నేళ్లుగా తన మనవడు హ్యారీ, అతడి భార్య మేఘన్ ఎదుర్కొన్న సవాళ్ల పట్ల రాణి ఎలిజెబెత్ విచారం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: హ్యారీ-మేఘన్ వ్యాఖ్యలపై రాజకుటుంబం స్పందన