నార్వేలో అకస్మాత్తుగా (norway covid restrictions) కొవిడ్ నిబంధనలను ఎత్తివేశారు. దీంతో ప్రజలు ఒక్కసారిగా బయటకు వచ్చేసరికి కోలాహలం నెలకొంది. నగరాల్లో వీధులు, బార్లు, రెస్టారెంట్లు, నైట్‌క్లబ్‌లకు తాకిడి పెరిగిపోవడం వల్ల పలుచోట్ల గలాటాలు, ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. 53 లక్షల జనాభా ఉన్న నార్వేలో జనజీవనం తిరిగి సాధారణ స్థితికి చేరుకునేలా.. కొవిడ్ నిబంధనలను శనివారం నుంచి ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నార్వే ప్రధానమంత్రి ఎర్నా సోల్‌బెర్గ్ శుక్రవారం మధ్యాహ్నం అనూహ్యంగా ఈ ప్రకటన చేశారు.
దీంతో రాజధాని ఓస్లో సహా దేశమంతటా కోలాహల వాతావరణం కనిపించింది. శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఇదే పరిస్థితి నెలకొంది. పలుచోట్ల శాంతిభద్రతల సమస్య తలెత్తినట్లు పోలీసులు తెలిపారు. టీకా ధ్రువపత్రాలు, నెగెటివ్ రిపోర్టులు గానీ అవసరం లేదని ప్రకటించడం వల్ల (norway covid restrictions).. నైట్‌క్లబ్‌లు, బార్లు, రెస్టారెంట్లలో ప్రజలు బారులు తీరి కనిపించారు.
ఇదీ చూడండి : Taliban news: 'భరోసా ఇస్తాం.. విమాన సర్వీసులు ప్రారంభించండి'