రెండు వైమానిక దళ యుద్ధ విమానాలు ఢీ కొన్న ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. మరో పైలట్ పారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడ్డాడని అధికారు వెల్లడించారు. యుద్ధ విమానాల్లో వైమానిక దళ సిబ్బంది శిక్షణ తీసుకుంటుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తమ దేశానికి చెందిన రెండు యూరో యుద్ధ విమానాలు ఢీ కొన్నాయని జర్మనీ పశ్చిమ పొమెరానియా రాష్ట్ర అంతర్గత వ్యవహారాల మంత్రి మెక్లెన్‌బర్గ్ నిర్ధారించారు. లేక్ మ్యూరిట్జ్‌కి సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానిక మీడియా పేర్కొంది.
ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. విమానాలు ఢీ కొన్న తర్వాత పెద్ద ఎత్తున పొగలు కక్కుతూ రెండూ కూలిపోయాయి. అయితే, ఈ విషయంపై జర్మనీ వైమానిక దళం ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇదీ చూడండి: 1300 అడుగుల ఎత్తులో అన్నాచెల్లెళ్ల రోప్వాక్