ETV Bharat / international

ఆగని కరోనా మరణాలు.. ఇటలీ, స్పెయిన్​లలో తీవ్రం - ప్రపంచంలో కరోనా వైరస్​

కరోనా ప్రపంచ దేశాల్లో వణుకుపుట్టిస్తోంది. మృతుల సంఖ్య 34 వేలకు చేరువైంది. కేసులు 7 లక్షలు దాటిపోయాయి. ఇటలీ, స్పెయిన్​, అమెరికా, యూకే, ఫ్రాన్స్​లలో కొవిడ్​-19 ప్రభావం తీవ్రంగా ఉంది. ఇటలీలో ఆదివారం మరో 756 మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్​లో ఆ సంఖ్య 821గా ఉంది. అమెరికాలో కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

Record virus deaths in Spain as world hunkers down for long haul
ఆగని కరోనా మరణాలు.. ఇటలీ, స్పెయిన్​లలో తీవ్రం
author img

By

Published : Mar 30, 2020, 5:42 AM IST

Updated : Mar 30, 2020, 7:16 AM IST

కరోనా.. ప్రస్తుతం భారత్​ సహా ప్రపంచదేశాలను కలవరపెడుతోన్న మహమ్మారి. ఈ ప్రాణాంతక వైరస్​ ధాటికి ఎందరో బలైపోతున్నారు. రోజురోజుకూ వేలకొద్దీ కేసులు, మరణాలు పుట్టుకొస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 199కిపైగా దేశాలకు పాకిన కొవిడ్​-19 తీవ్రతను ఎలా తగ్గించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

ఇప్పటివరకు కేసులు 7 లక్షలను మించాయి. దాదాపు 34 వేల మందిని బలితీసుకుందీ కరోనా. ఇటలీలో అత్యధికంగా 10 వేల 779 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మరణాల సంఖ్య 756. కొత్తగా నమోదైన 5217 కేసులతో మొత్తం కేసులు లక్షను సమీపించాయి.

ఐరోపా సంఘం(ఈయూ)లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఇటలీలో కరోనా దెబ్బకు పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో లక్షల మందికి ఆదాయం కరవైంది. తినడానికి తిండి కూడా లేక పలువురు అలమటిస్తున్నారు. తాజాగా సిసిలీ ప్రాంతంలో సూపర్‌ మార్కెట్లను స్థానికులు లూటీ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గుంపులుగా సూపర్‌ మార్కెట్లలోకి ప్రవేశించిన జనం.. తమకు కావాల్సినవి తీసుకొని, డబ్బులు చెల్లించకుండానే బయటకు పరిగెత్తారు.

అక్కడ రాకుమారి కూడా..

ఇటలీ తర్వాత స్పెయిన్​లో వైరస్​ విలయతాండవం చేస్తోంది. 24 గంటల వ్యవధిలో అక్కడ 821 మంది మరణించారు. ఆదివారం మరో 6 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడిన స్పెయిన్‌ రాకుమారి మరియా థెరిసా మరణించినట్లు అక్కడి రాజ కుటుంబం వెల్లడించింది.

యూకేలోనూ మరణాల సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. మరో 209 మంది చనిపోగా, మొత్తం మృతులు 1228కి చేరారు. కేసులు 20 వేలకు చేరువలో ఉన్నాయి.

ఫ్రాన్స్​లో ఇప్పుడిప్పుడే కరోనా మరింత వేగంగా విస్తరిస్తోంది. ఆదివారం అక్కడ 292 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 2,606కు చేరింది. కేసులు 40వేలకుపైమాటే.

అమెరికా...

అగ్రరాజ్యం గురించి వేరే చెప్పక్కర్లేదు. మహమ్మారి అంతలా విస్తరిస్తోందిక్కడ. రోజూ దాదాపు 20 వేల కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. మరణాల సంఖ్యా పెరుగుతోంది. ఆదివారం మరో 18 వేలకుపైగా కేసులతో మొత్తం కేసులు లక్షా 41వేలను దాటాయి. మృతులు 2400 కంటే ఎక్కువే.

మిగతా దేశాల్లో చూస్తే.. ఇరాన్​లో మరో 123 మంది చనిపోయారు. 2901 తాజా కేసులతో 38 వేల 309 మందికి వైరస్​ సోకింది. 2640 మంది వైరస్​కు బలయ్యారు.

నెదర్లాండ్స్​లోనూ కొవిడ్​-19 కోరలు చాస్తోంది. ఆదివారం అక్కడ 132 మంది మరణించగా.. మరో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. బెల్జియం, స్విట్జర్లాండ్​, జర్మనీల్లో వరుసగా 78, 36, 49 మంది ఒక్కరోజులో ప్రాణాలు విడిచారు.

చైనాలో సాధారణ పరిస్థితులు...

చైనాలో నిన్న 45 మందికి మాత్రమే వైరస్​ సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. మరో 5 మరణాలతో.. మొత్తం మృతుల సంఖ్య 3,300గా ప్రకటించారు. బాధితులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో వుహాన్‌ తప్ప హుబే ఫ్రావిన్స్‌కు దేశీయ విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వుహాన్‌లోనూ విధించిన ఆంక్షలను క్రమక్రమంగా తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

దక్షిణ కొరియాలో కొత్తగా 105 కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి.

తొలి మరణాలు..

సిరియా, బొలీవియా, అంగోలాలు తొలి కరోనా మరణాలను ధ్రువీకరించాయి. అంగోలాలో ఇద్దరు మృతిచెందారు.

Last Updated : Mar 30, 2020, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.