ETV Bharat / international

'భారత్​, చైనాలో మా టీకాను ఉత్పత్తి చేస్తాం'​

author img

By

Published : Nov 17, 2020, 8:30 PM IST

వ్యాక్సిన్ల అభివృద్ధి విషయంలో బ్రిక్స్​ దేశాలు కలిసికట్టుగా సాగాలని కోరారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్. కొవిడ్​ను ఎదుర్కోవడంలో తమ స్పుత్నిక్​ వీ టీకా సత్ఫలితాలనిస్తోందని వెల్లడించారు. వ్యాక్సిన్​ ఉత్పత్తిని భారత్​, చైనాలో ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. బ్రిక్స్​ శిఖరాగ్ర సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Putin says Sputnik V vaccine could be produced in India and China
మా టీకాను భారత్​, చైనాలో ఉత్పత్తి చేస్తాం: పుతిన్​

చైనా, భారత్​లలో తమ స్పుత్నిక్​ వీ టీకా ఉత్పత్తిని ప్రారంభించబోతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ తెలిపారు. వ్యాక్సిన్​ విషయంలో బ్రిక్స్​ దేశాలు ఉమ్మడి కార్యచరణకు రావాలని పిలుపునిచ్చారు. కొవిడ్​ను ఎదుర్కోవడంలో తమ టీకా ప్రభావవంతంగా పని చేస్తుందని పేర్కొన్నారు. బ్రిక్స్​ 12వ శిఖరాగ్ర సదస్సులో వర్చువల్​గా ప్రసంగించారు పుతిన్​.

"బ్రిక్స్​ దేశాల వ్యాక్సిన్​ అవసరాల కోసం పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మేము నమ్ముతున్నాం. ఆగష్టులో రిజస్టర్​ అయిన మా స్పుత్నిక్​ వీ టీకాను చైనా, భారత్​లో ఉత్పత్తి చేయనున్నాం. క్లినికల్​ ట్రయల్స్​ కోసం బ్రెజిల్​, భారత్​తో రష్యన్​ డైరెక్ట్ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్​ ఒప్పందం కుదుర్చుకుంది. చైనా, భారత్​లలో వ్యాక్సిన్​ ఉత్పత్తి కోసం ఫార్మా సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కేవలం తమ దేశ అవసరాల కోసమే కాకుండా ఇతర దేశాల కోసం వ్యాక్సిన్​ ఉత్పత్తి చేపడుతున్నాం.

-- వ్లాదిమిర్​ పుతిన్, రష్యా అధ్యక్షుడు

తమ టీకా కొవిడ్​పై ప్రభావవంతంగా పని చేస్తుందని పుతిన్​ చెప్పారు. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా తోడ్పడుతుందని తెలిపారు. టీకాను ప్రయోగించుకున్న తన కూతురు ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తమ స్పుత్నిక్​ వీ టీకా 92 శాతం.. సత్ఫలితాలను ఇస్తోందని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గతవారమే ప్రకటించింది.

ఈ ఏడాది ఆగష్టు 11న రష్యా తమ స్పుత్నిక్​ వీని రిజిస్టర్​ చేసింది. ప్రపంచంలోనే తొలిసారి కొవిడ్​కు టీకాను అందుబాటులోకి తెచ్చిన దేశంగా పేరు సంపాదించింది. గమాలియా పరిశోధన సంస్థ ఈ టీకాను అభివృద్ధి చేసింది. తమ మొదటి ఉపగ్రహం స్పుత్నిక్​ పేరు మీదుగా వ్యాక్సిన్​కు ఆ పేరును పెట్టింది రష్యా.

బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణ ఆఫ్రికాతో కూడిన బ్రిక్స్ కూటమి.. 360 కోట్ల మంది జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సదస్సుకు రష్యా నాయకత్వం వహిస్తోంది.

ఇదీ చూడండి:'ఉగ్రవాదంపై ఆ దేశాలను బాధ్యులుగా చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.