ETV Bharat / international

ఫిలిప్‌ అంత్యక్రియల్లో విలియం, హ్యారీ పక్కపక్కన నడవరు - విలియం, హ్యారీ పక్కపక్కన నడవరు

ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియల సందర్భంగా ఆయన మనవలు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీలు పక్కపక్కన నడిచే అవకాశాలు లేవు. గతేడాది రాజకుటుంబాన్ని వీడాలని హ్యారీ నిర్ణయించుకున్నప్పటి నుంచి సోదరుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

philip funeral, william-harry
ఫిలప్ అంత్యక్రియలు, ఫిలిప్-హ్యారీ
author img

By

Published : Apr 16, 2021, 8:45 AM IST

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ (99) అంత్యక్రియల సందర్భంగా ఆయన మనవలు ప్రిన్స్‌ విలియం, ప్రిన్స్‌ హ్యారీలు పక్కపక్కన నడిచే అవకాశాలు లేవు. అంత్యక్రియలకు ముందు మృతదేహం ఉంచిన శవపేటికను చర్చిలోకి తీసుకెళ్లే సమయంలో కుటుంబసభ్యులు దానితోపాటే నడుస్తారు. రాజకుటుంబాన్ని వీడాలని గతేడాది హ్యారీ నిర్ణయించుకున్నప్పటి నుంచి సోదరుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

ఈ నేపథ్యంలో ఒకవేళ సోదరులు ఇద్దరు పక్కపక్కన నడిస్తే ఏవైనా ఇబ్బందికర పరిణామాలు తలెత్తవచ్చన్న ఉద్దేశంతో రాజకుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ గురువారం అంత్యక్రియలకు సంబంధించి ఓ ప్రకటన జారీచేసింది. హ్యారీ, విలియంల మధ్య హ్యారీ బంధువు ఫిలిప్స్‌ నడుస్తారని అందులో స్పష్టంచేసింది.

1997లో డయానా మరణించిన సమయంలో యువకులుగా ఉన్న విలియం, హ్యారీలు ఆమె శవపేటికతోపాటు కలిసే నడిచారు. ఈ నెల తొమ్మిదిన మరణించిన ప్రిన్స్‌ ఫిలిప్‌ అంత్యక్రియలు ఆగ్నేయ ఇంగ్లండ్‌లోని విండ్సర్‌ దుర్గంలో ఉన్న సెయింట్‌ జార్జ్‌ చాపెల్‌లో శనివారం (ఈ నెల 17న) జరగనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

ఇదీ చదవండి:భీతి నుంచి స్వేచ్ఛకు... 30 కిలోమీటర్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.