ETV Bharat / international

'మానసికంగా కుంగిపోయా, మద్యానికి బానిసయ్యా' - బ్రిటన్ రాజకుటుంబం

బ్రిటన్ రాజకుటుంబంలో తనను ఎవరూ పట్టించుకోలేదని ప్రిన్స్ హ్యారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ తానెంతో నలిగిపోయానన్నారు. మద్యానికి బానిసయ్యానని, డ్రగ్స్ తీసుకోవాలనిపించేదని ఓ ఇంటర్వ్వూలో చెప్పారు.

Prince Harry
ప్రిన్స్ హ్యారీ
author img

By

Published : May 22, 2021, 7:16 AM IST

బ్రిటన్​ రాజకుటుంబంలో ఉంటూ తానెంతో నలిగిపోయానని.. అక్కడ ఎవరూ తనను పట్టించుకోలేదని ప్రిన్స్​ హ్యారీ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. అమెరికా టీవీ యాంకర్​ ఓప్రా విన్​ఫ్రేకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మద్యానికి తాను ఎలా బానిసైందీ హ్యారీ వివరించారు. తల్లి డయానా మరణం తనను మానసికంగా ఎంత కుంగదీసిందీ తెలిపారు. తన భార్య మేఘన్​ మార్కెట్​ కూడా తల్లి డయానాలా ఇబ్బంది పడుతుందన్న ఆందోళన తనను వెంటాడేదని అన్నారు. మానసికంగా మేఘన్​ పరిస్థితి బాగా లేనప్పుడు తన కుటుంబం ఎలాంటి సాయం చేయలేదని తెలిపారు.

"నేను చేసిన విజ్ఞప్తిని, హెచ్చరికను దేన్నీ రాజకుటుంబం పట్టించుకోలోదు. నిర్లక్ష్యం వహించారు. 28 నుంచి 32 ఏళ్ల వయసులో నేను మానసికంగా కుంగిపోయాను. తాగాలనిపించేది. మాదక ద్రవ్యాలు తీసుకోవాలనిపించేది. వారంలో తాగాల్సిన మద్యాన్ని ఒకే రోజులో తాగిన సందర్భాలూ ఉన్నాయి."

-ప్రిన్స్​ హ్యారీ

హ్యారీ, మేఘన్ దంపతులు గత ఏడాది బ్రిటన్ రాజకుటుంబం నుంచి పూర్తి సంబంధాలు తెంచుకున్నాకురు. ప్రస్తుతం వీరు కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు.

ఇదీ చదవండి : ''భారత్​ వేరియంట్' సమాచారాన్ని తొలగించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.