కరోనాను కట్టడి చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి నెలరోజుల పాటు దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు ప్రకటించింది.
బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రసంగించారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు బాగానే ఉన్నప్పటికీ అవి సరిపోవని అభిప్రాయపడ్డారు. ఇంకా కఠినమైన పద్ధతులు పాటించాల్సి ఉందని చెప్పారు.
"కరోనాతో సహజీవనం చేయాలని మేము ఎప్పడూ చెబుతూనే ఉన్నాం. వైరస్ కట్టడికి సాధ్యమైనంత మేర కృషి చేశాం. కానీ, మనం మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. అందుకే దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాం. కొవిడ్ కట్టడికి సమష్టిగా కృషి చేయాలి. అయితే.. ఈ లాక్‌డౌన్‌లోనూ పాఠశాలలు తెరిచే ఉంటాయి."
-- ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు
ఫ్రాన్స్‌లో వైరస్ విజృంభిస్తోంది. ఇదే ఒరవడి కొనసాగితే.. నవంబర్ నెల మధ్య నాటికి అన్ని ఆసుపత్రుల్లోనూ కొవిడ్ రోగులే ఉంటారని ఇమ్మాన్యుయేల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:కరోనా బాధితుల్లో విటమిన్-డి లోపం!