ETV Bharat / international

'ప్రపంచ దేశాలకు 50కోట్ల టీకాలు అందిస్తాం' - america President

అభివృద్ధి చెందుతున్న దేశాలకు 50 కోట్ల టీకా డోసులను విరాళంగా అందించడమే తమ లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన.. ప్రపంచ జనాభాలో 70శాతం మందికి టీకాలు అందించడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.

Covid
Covid
author img

By

Published : Sep 22, 2021, 10:57 PM IST

ప్రపంచ జనాభాలో 70% మందికి టీకాలు వేయాలనే లక్ష్యం నేపథ్యంలో టీకా తయారీని రెట్టింపు చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో(UNGA 2021) ప్రసంగించిన ఆయన.. వచ్చే ఏడాదిలోగా 50 కోట్ల ఫైజర్ టీకా(Pfizer Vaccine) డోసులు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తామని స్పష్టం చేశారు.

185 దేశాల్లో డెల్టా వేరియంట్​

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization)తెలిపింది. గత వారంతో పోలిస్తే ఈ వారం కొత్త కేసులు క్షీణించాయని పేర్కొంది. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాల్లో 22 శాతం, ఆగ్నేయాసియా ప్రాంతంలో 16 శాతం కేసుల తగ్గుదల అనేది ఊరట కలిగించే అంశమని మంగళవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అయితే భారత్, అమెరికా, బ్రిటన్, టర్కీ, ఫిలిప్పీన్స్‌లో అత్యధిక కరోనా కేసులు నమోదైనట్లు తెలిపింది. లాంబ్డా, మ్యూ వేరియంట్‌ల వ్యాప్తిని నిశితంగా గమనిస్తున్నట్లు వివరించిన డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక.. వేగంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ ప్రస్తుతం 185 దేశాలకు విస్తరించిందని వివరించింది.

మూడు కేసులకే లాక్​డౌన్..

కరోనాను ఎక్కడిక్కడ కట్టడి చేస్తున్న చైనా తీరుతో విదేశీ పర్యటకులతో పాటు.. సొంత ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి ప్రజలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ.. వరుస లాక్​డౌన్లు విధిస్తోంది. 2022-ఫిబ్రవరి 4నుంచి ప్రారంభంకానున్న బీజింగ్ వింటర్ ఒలింపిక్స్​లో విదేశీ అథ్లెట్లు పాల్గొనాల్సి ఉంది. అయితే విదేశీ ప్రయాణికులపై ఆంక్షలున్నాయి. ఈ గేమ్స్​లో ప్రేక్షకులకు అనుమతిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం మౌనంగా ఉందని వాంగ్ హుయ్ అనే ట్రావెల్ ఏజెంట్ వాపోయాడు. దీనితో సొంత ప్రజలు నిరుత్సాహపడుతున్నట్లు పేర్కొన్నాడు. ఫిబ్రవరిలో జరగనున్న వింటర్ గేమ్స్​తో పాటు.. మార్చి 4-13 తేదీల్లో జరిగే పారాలింపిక్ వింటర్ గేమ్స్‌లో దాదాపు 2,900 మంది అథ్లెట్లు పోటీ పడేందుకు వస్తారని అంచనా.

అయితే చైనా వాదన మరోలా ఉంది. జులైలో దేశంలోకి వచ్చిన వ్యాపారులే దేశంలో డెల్టా వేరియంట్‌ వ్యాప్తికి కారణమయ్యారని చైనా ఆరోపించింది. మొత్తంగా వైరస్​పై పోరులో చైనా అవలంబిస్తున్న తీరును కొందరు నిపుణులు తప్పుబడుతున్నారు. 'ప్రస్తుత చర్యలతో వైరస్‌ ముప్పు తొలగిపోతుందని అనుకోవట్లేదు. వాస్తవికతతో జీవించాల్సిన అవసరం ఉంది' అని హాంకాంగ్ యూనివర్శిటీ మెడికల్ సెక్యూరిటీ ప్రొఫెసర్ నికోలస్ థామస్ అభిప్రాయపడ్డారు.

ఈశాన్య చైనాలోని హర్బిన్‌ నగరాన్ని మూసేసింది చైనా(Lockdown in China) ప్రభుత్వం. దాదాపు కోటి మంది జనాభా ఉన్న ఈ నగరంలో మొత్తం మూడు కేసులు(China Corona Cases) నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి పెరగకుండా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. అత్యవసరమైన ప్రయాణానికి మాత్రమే అనుమతిస్తున్న అధికార యంత్రాంగం.. నెగెటివ్ రిపోర్ట్​ను తప్పనిసరి చేసింది.

ఒక్కసారిగా పెరిగిన మరణాలు..

అమెరికాలో కరోనా మరణాలు(Corona Deaths in America) ఈ ఏడాది మార్చి తర్వాత 1,900కి పైగా పెరిగాయి. డిసెంబర్‌లో రోజుకు 3,000 మరణాలు సంభవించినప్పటికీ పెద్దగా ఆశ్చర్యం కలగలేదని.. ఎందుకంటే అప్పుడు దాదాపు పౌరులెవరూ టీకాలు తీసుకోలేదని ఆరోగ్య నిపుణులు (US Healthcare System) తెలిపారు. అయితే ప్రస్తుతం అమెరికా జనాభాలో దాదాపు 64 శాతం మంది కనీసం మొదటి డోసు టీకాను పొందారని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ(John Hopkins University) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో గత రెండు వారాల్లో మరణాలు సగటున 1,387 నుంచి 1,947 వరకు అంటే 40 శాతం పెరిగినట్లు ఈ డేటా తెలిపింది. ఇంకా 70 మిలియన్లకు పైగా అమెరికన్లు వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంది.

నిర్ధరణ పరీక్షల్లో వేగం..

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ నిర్ధరణ పరీక్షలను వేగవంతం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు(America President) జో బైడెన్(Joe Biden) ప్రకటించారు. ఇంటి వద్దకే వచ్చి పరీక్షలు నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అయితే డిమాండ్ నేపథ్యంలో టెస్టింగ్ కిట్ల ఉత్పత్తికి వారాల సమయం పడుతుందని తయారీదారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ నిర్ణయంతో ఆసుపత్రులపై అదనపు భారం పడుతుందని అంచనా.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.