ఇటలీ పర్యటనలో భాగంగా రోమ్‌లోని ప్రవాస భారతీయ బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిశారు. అనంతరం.. వారితో సంభాషణ గొప్పగా జరిగిందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
"రోమ్‌లో ప్రవాస భారతీయులతో చర్చించాను. దేశంతో ఎనలేని బంధాన్ని ఏర్పరచుకున్న వారితో సంభాషణలు గొప్పగా జరిగాయి. వివిధ అంశాలపై వారి ఆలోచనలు వినడం చాలా అద్భుతంగా అనిపించింది."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ప్రధాని మోదీతో భేటీపై సనాతన్ ధర్మ సంఘ అధ్యక్షురాలు స్వామిని హంసనంద గిరి స్పందించారు. 'ఇటలీలో హిందువుగా జీవించడం కష్టం. ఇక్కడ హిందువులు మైనారిటీలు. కానీ ఇటలీలో మోదీని కలవడం చాలా గౌరవంగా ఉంది. ఆయనతో చర్చ చలించివేసింది.' అని తెలిపారు.
జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం.. ఇటలీకి వెళ్లారు. శని, ఆదివారాల్లో జీ20 సదస్సు జరగనుంది.
ఇవీ చూడండి:-