ETV Bharat / international

'ప్లాస్మాథెరపీ వల్ల ప్రయోజనం లేదు'

author img

By

Published : May 16, 2021, 7:20 AM IST

కొవిడ్​ రోగులకు అందించే ప్లాస్మాథెరపీ వల్ల ప్రయోజనం లేదని యూకేలో తాజాగా నిర్వహించిన అధ్యయన నివేదికను మెడికల్​ జర్నల్​ లాన్సెట్ ప్రచురించింది. ఈ చికిత్స.. వైరస్‌ తీవ్రతను, మరణాలను తగ్గించలేదని పేర్కొంది. వైద్య చికిత్స మార్గదర్శకాల నుంచి తొలగించాలని సూచించింది.

Plasma therapy
ప్లాస్మా చికిత్స

ప్లాస్మాథెరపీ వల్ల ప్రయోజనం ఏమీ కనిపించలేదని మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ యూకేలో తాజాగా నిర్వహించిన ఓ అధ్యయన నివేదికను ప్రచురించింది. ఈ చికిత్సతో ఆసుపత్రిలో చేరిన రోగి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడిన దాఖలా ఏమీ కనిపించలేదని పేర్కొంది. ఇదివరకు భారత్‌కు చెందిన ఐసీఎంఆర్‌-ప్లాసిడ్‌, అర్జెంటీనాకు చెందిన ప్లాస్మాఆర్‌ ట్రయల్స్‌లోనూ ప్లాస్మాథెరపీ వల్ల ఆసుపత్రుల్లో చేరిన రోగులకు ఏ ప్రయోజనమూ కనిపించలేదని తేలింది. యూకేలో గతేడాది మే 28 నుంచి ఈ ఏడాది జనవరి 15 వరకు 11,558 మంది రోగులను రెండు విభాగాలుగా విభజించి ర్యాండంగా అధ్యయనం చేశారు.

ఇందులో ప్లాస్మాథెరపీ తీసుకున్న 5,795 మంది బృందంలో 1,399 మంది (24 శాతం) చనిపోగా, సాధారణ చికిత్స అందుకున్న మరో బృందంలోని 5,763 మందిలోనూ 1,408 (24 శాతం) మంది మృతిచెందారు. ప్లాస్మాథెరపీ తీసుకున్న మిగతా రోగులు సగటున 12 రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా, సాధారణ చికిత్స రోగులు 11 రోజుల్లో కోలుకొని ఇంటికి వెళ్లినట్లు ఈ అధ్యయన నివేదిక పేర్కొంది. మెడికల్‌ వెంటిలేషన్‌ అవసరంలో కూడా రెండు బృందాల మధ్య పెద్ద తేడా లేదని తెలిపింది. మెకానికల్‌ వెంటిలేషన్‌ అవసరమైనవారు, మృతిచెందినవారి సంఖ్య రెండు బృందాల్లో 29 శాతం దాకా ఉన్నట్లు పేర్కొంది. విస్తృతస్థాయిలో జరిగిన ఈ అధ్యయనం ప్రకారం.. కన్వలాసెంట్‌ ప్లాస్మాథెరపీ వల్ల ఆసుపత్రుల్లో చేరిన రోగుల్లో ఆరోగ్య పరిస్థితులు, కొలమానాలు మెరుగుపడిన దాఖలా కనిపించలేదని స్పష్టం చేసింది. తాజా అధ్యయనాలు ఇదివరకు నిర్వహించిన అధ్యయనాలకు అనుగుణంగానే ఉన్నట్లు పేర్కొంది.

ప్లాస్మా చికిత్సకు ఇక.. స్వస్తి

ప్లాస్మాథెరపీకి వైద్యులు ఇక స్వస్తి పలకనున్నారు. శుక్రవారం జరిగిన ఐసీఎంఆర్‌ జాతీయ టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలోనూ ఇదే అభిప్రాయాన్ని సభ్యులు బలపరిచారు. ఈ మేరకు ఐసీఎంఆర్‌ నుంచి త్వరలో మార్గదర్శకాలు జారీ కానున్నాయి. హేతుబద్ధం కాని ప్లాస్మాథెరపీ సిఫార్సులను ఆపాలంటూ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కె.విజయ రాఘవన్‌కు, ఐసీఎంఆర్‌ చీఫ్‌ బలరాం భార్గవకు, ఎయిమ్స్‌ సంచాలకుడు రణదీప్‌ గులేరియా తదితరులకు ప్రముఖ వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా లేఖలు రాశారు.

ఇదీ చూడండి: 'జులై నాటికి 51.6 కోట్ల టీకా డోసుల పంపిణీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.