ETV Bharat / international

ప్రపంచమంతా క్రిస్మస్​ సంబరాలు.. ఫిలిప్పీన్స్​లో తుపాను

ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా బుధవారం ప్రపంచ దేశాల్లో క్రిస్మస్​ వేడుకలు అట్టహాసంగా సాగాయి. క్రైస్తవ ఆధ్యాత్మిక పెద్దలు శాంతి సందేశాలు అందించారు. అయితే.. తుపానుతో అతలాకుతలమైన ఫిలిప్పీన్స్​, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో ఫ్రాన్స్​ దేశాల్లో పలు చోట్ల క్రిస్మస్​కు దూరంగా ఉన్నారు.

Christmas
ప్రపంచమంతా క్రిస్మస్​ సంబరాలు
author img

By

Published : Dec 26, 2019, 5:31 AM IST

Updated : Dec 26, 2019, 7:10 AM IST

ప్రపంచమంతా క్రిస్మస్​ సంబరాలు.. ఫిలిప్పీన్స్​లో తుపాను

ప్రపంచ దేశాలు బుధవారం క్రిస్మస్​ సంబరాల్లో మునిగితేలాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి చర్చిల్లో ప్రార్థనలు చేశారు క్రైస్తవులు. మిఠాయిలు పంచుకున్నారు. ఆయా దేశాల్లో క్రైస్తవ ఆధ్యాత్మిక పెద్దలు శాంతి సందేశాలు అందించారు. అయితే.. ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్​ దేశాల్లో క్రిస్మస్​ సందడి కనిపించలేదు. తుపాను ధాటికి ఫిలిప్పీన్స్​ జనజీవనం అతలాకుతలమైంది. ఫ్రాన్స్​లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తాయి.

ఫిలిప్పీన్స్​లో తుపాను బీభత్సం..

ఫిలిప్పీన్స్​లో తుపాను బీభత్సం సృష్టించింది. ప్రచండగాలులతో కురుస్తున్న వర్షాలకు భారీ వృక్షాలు నేలకూలాయి. వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరదలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో ఈ ఏడాది క్రిస్మస్​ వేడుకలకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల్లోని చర్చిల్లో క్రిస్మస్​ వాతావరణం కనిపించలేదు.

ఆందోళనతో ఫ్రాన్స్​..

ఫ్రాన్స్​లో ఈ ఏడాది చాలా మంది క్రిస్మస్​కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వం పింఛను వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలకు వ్యతిరేకంగా చేస్తోన్న సమ్మె నాలుగో వారానికి చేరుకుంది. ఈ కారణంగా చాలా మంది ప్రజలు.. కుటుంబం, స్నేహితులతో కలిసి క్రిస్మస్​ వేడుకలు చేసుకోవాలన్న ప్రణాళికలు వ్యర్థమయ్యాయి.

సూడాన్​ ప్రజలకు పోప్​ శాంతి సందేశం..

ఆఫ్రికన్​ దేశాలు, తిరుగుబాటుదారుల మధ్య శాంతి చర్చలు విఫలమైన క్రమంలో పోప్​ ఫ్రాన్సిస్​, కాంటర్బరీ ఆర్చ్​ బిషప్​ జస్టిన్​ వెల్బీ.. దక్షిణ సూడాన్​కు శాంతి సందేశాలు అందించారు. సూడాన్​లో ప్రజల మధ్య సయోధ్య, సోదరభావం కోసం ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు 1.3 బిలియన్లకుపైగా ఉన్న క్రైస్తవ ఆధ్యాత్మిక గురువులు.

కొలరాడోలో వింత అనుభవం..

అమెరికా కొలరాడో రాష్ట్రంలో క్రిస్మస్​ వేడుకల్లో పాల్గొన్నవారిని ఓ దొంగ ఆశ్చర్యానికి గురిచేశాడు. గత సోమవారం కొలరాడో స్ప్రింగ్స్​లోని ఓ బ్యాంకులో దొంగతనం చేసిన వ్యక్తి ఆ నగదును మొత్తం గాల్లోకి విసిరేశాడు, మేరీ క్రిస్మస్​ అంటూ నినాదాలు చేశాడు. ప్రజలు వాటిని తీసుకునేందుకు ఎగబడ్డారు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి: 'చైనా తుపాకుల కన్నా మా సత్యమే శక్తిమంతం'

AP Video Delivery Log - 2100 GMT News
Wednesday, 25 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2054: Israel Netanyahu Rocket Must credit content creator 4246348
Netanyahu speech halted as rocket intercepted
AP-APTN-2006: US DE Dignified Transfer AP Clients Only 4246341
Remains of soldier killed in Afghanistan returned
AP-APTN-1950: Russia Putin Business No access Russia; No use by Eurovision 4246340
Putin meets business people to discuss economy
AP-APTN-1910: Chile Fire 2 NO ACCESS CHILE/ NO INTERNET 4246339
Dozens of Chileans sift through ruins of burned homes
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 26, 2019, 7:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.