ETV Bharat / international

కోతులపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ సక్సెస్! - COVID-19 vaccine test on monkeys shows promise

కొవిడ్​ వ్యాక్సిన్​ అభివృద్ధిలో కీలక పురోగతి సాధించింది ప్రఖ్యాత ఆక్ప్​ఫర్డ్​ యూనివర్సిటీ. కోతులపై నిర్వహించిన ట్రయల్స్​లో ఆశాజనక ఫలితాలు వచ్చినట్లు వెల్లడించింది. వ్యాక్సిన్​ ఇచ్చిన వానరాలపై కరోనా వైరస్​ ప్రభావం చూపలేకపోయినట్లు పరిశోధన ద్వారా తేల్చింది. బ్రిటన్​లో మానవులపై నిర్వహిస్తున్న వ్యాక్సిన్ ట్రయల్స్​పై మరో నెల రోజుల్లో స్పష్టత రానున్న నేపథ్యంలో ఈ ఫలితాలను స్వాగతిస్తున్నారు నిపుణులు.

COVID-19 vaccine test on monkeys shows promise
కోతులపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం!
author img

By

Published : May 15, 2020, 6:23 PM IST

Updated : May 15, 2020, 10:41 PM IST

బ్రిటన్​లో అతిపెద్ద కొవిడ్-19 వ్యాక్సిన్​ అభివృద్ధి ప్రాజెక్టును చేపడుతోంది ప్రముఖ ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ. వ్యాక్సిన్​ ట్రయల్స్​లో భాగంగా కోతులపై జరిపిన పరిశోధనలో ఆశాజనక ఫలితాలు సాధించినట్లు విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు తెలిపారు. వ్యాక్సిన్​ను ప్రయోగించిన కోతుల్లో రోగనిరోధక వ్యవస్థ కరోనాను నిలువరించినట్లు గుర్తించారు. అంతేకాకుండా ఎలాంటి దుష్ప్రభావాలు లేవని తేల్చారు.

ఈ అధ్యయానాన్ని ఇంకా పూర్తి స్థాయిలో సమీక్షించాల్సి ఉంది. ఒక్క డోసుతోనే కోతుల్లో ఊపిరితిత్తుల నష్టం జరగకుండా నిరోధించడం సహా ఇతర అవయవాలపైనా వైరస్ ప్రభావం ఏ మాత్రం పడకుండా నిలువరించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. కరోనా వైరస్​ తీవ్రంగా ఉన్న ఆరు కోతులకు వ్యాక్సిన్ ఇచ్చిన అనంతరం నిమోనియా బారినపడలేదని, హానికర లక్షణాలను గుర్తించలేదని పరిశోధకులు వివరించారు.

బ్రిటన్​లో మానవులపై జరుగుతున్న వ్యాక్సిన్ ప్రయోగం ఇంకా తుది దశకు చేరుకోనప్పటికీ ఇప్పుడు సాధించిన పురోగతి స్వాగతించదగినదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే మనుషులపై ఈ వ్యాక్సిన్​ ఏ మేర ప్రభావం చూపుతుందో పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేశారు. తుది ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

మానవుల్లోనూ ప్రభావం...

మానువుల్లోనూ ఈ వ్యాక్సిన్ కచ్చితంగా ప్రభావం చూపుతుందని విశ్వాసంతో ఉన్నట్లు చెబుతున్నారు పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్​ సారా గిల్బర్ట్​. అనేక మందిపై ట్రయల్స్ నిర్వహించాల్సి ఉందన్నారు.

ఈ ప్రాజెక్టులో ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీతో భాగస్వామ్యం వహిస్తోంది బ్రిటన్ ప్రఖ్యాత డ్రగ్స్​ సంస్థ ఆస్ట్రాజినికా. ట్రయల్స్​ విజయవంతమైతే ఈ ఏడాది చివరి నాటికి 100 మిలియన్ల డోసులను సిద్ధం చేస్తామని తెలిపింది.

మానవులపై ట్రయల్స్ విజయవంతమైతే కెన్యా మెడికల్ రీసెర్చ్​ సంస్థను సంప్రదించి ఆ దేశంలో పరీక్షించేందుకు అనుమతి పొందుతామన్నారు పరిశోధకులు.

బ్రిటన్​ ఆరోగ్య కార్యకర్తలపై నిర్వహించిన వ్యాక్సిన్​ ట్రయల్స్ ఫలితాలు వచ్చే నెలలో రానున్నాయి. అప్పుడే వ్యాక్సిన్​ పురోగతిపై ఓ అంచనాకు వచ్చే వీలుంది.

Last Updated : May 15, 2020, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.